టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న శర్వానంద్ .. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడా.. అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శర్వానంద్ పెళ్లి వార్త ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ గా శర్వా స్పందించినప్పటికీ బ్యాగ్రౌండ్ లో మాత్రం తనకు కాబోయే భార్య డీటెయిల్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
శర్వా కాబోయే భార్య కోట్లకు అధిపతిరాలుగా తెలుస్తుంది . అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని శర్వా పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . కాగా ఎట్టకేలకు ఆ అమ్మాయికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి . శర్వానంద్ కి కాబోయే భార్య పేరు రక్షిత రెడ్డి . తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అంటూ సమాచారం అందుతుంది .
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దివంగత టిడిపి నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి రక్షిత మనవరాలు అవుతుందట . రక్షిత ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ ఉద్యోగం చేసుకుంటుందని ..ఇది పూర్తిగా ప్రేమ వివాహం అంటూ తెలుస్తుంది . శర్వా-రక్షిత మధ్య కామన్ ఫ్రెండ్ ద్వార పరిచయం ఏర్పడిందని . అది అలా అలా ప్రేమగా మారి ఇప్పుడు భార్యాభర్తలు అయ్యేవరకు వెళ్లిందని తెలుస్తుంది . అంతేకాదు జనవరి 26న గ్రాండ్గా వీరి నిశ్చితార్ధం జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో శర్వానంద్ కాబోయే భార్య ఇంత పెద్ద తోపా అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!