టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శర్వా పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపించినా.. దానిపై అఫీషియల్ ప్రకటన చేయలేదు . ఈ క్రమంలోనే యధావిధిగా ఇదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసారు జనాలు . అయితే ఎవరు ఊహించని విధంగా ఈరోజు తన కాబోయే భార్యను జనాలకు పరిచయం చేశాడు శర్వానంద్ .
ఈరోజు రక్షిత రెడ్డితో తన వివాహ బంధానికి ముహూర్తం ఫిక్స్ చేసుకొని ..నిశ్చితార్థపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసి చాలామంది నెటిజన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు . ఈ ఫంక్షన్ కి ప్రముఖులు అందరు అటెండ్ అయ్యారు . చిరంజీవి , నాగార్జున, శ్రీకాంత్ ,రామ్ చరణ్ , హీరో సిద్ధార్థ్ అందరూ అటెండ్ అయి బ్లెస్ చేశారు .
అయితే అందరూ తమ అఫీషియల్ భార్యలతో వచ్చి శర్వాను బ్లెస్స్ చేయగా ,,హీరో సిద్ధార్థ మాత్రం తన డేటింగ్ గర్ల్ ఫ్రెండ్ అతిథి హైదరితో వచ్చి అభిమానులకు షాక్ ఇచ్చాడు . కొన్ని రోజులుగా వీళ్లిద్దరు ఎక్కడికి వెళ్తున్న జంటగానే వెళ్తున్నారు . అయితే మీ మధ్య ప్రేమ ఉందా అంటే దానికి ఆన్సర్ చెప్పడం లేదు ..పెళ్లి చేసుకోబోతున్నారా అంటే నో కామెంట్ అంటున్నారు . ఇలాంటి క్రమంలోనే శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి సిద్దు – అతిథి హైదరితో కలిసి రావడం సంచలనంగా మారింది .
అయితే సిద్దు కి శర్వానందే కాదు అతగాడికి కాబోయే భార్య రక్షిత రెడ్డి కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అని ..ఈ క్రమంలోనే సిద్ధార్థ అతిధి తో కలిసి వచ్చాడని తెలుస్తుంది . దీంతో ఇన్నాళ్లు చాలా సైలెంట్ గా ఉన్న శర్వానంద్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అంతేకాదు శర్వానంద్ భార్య గోల్డ్ మెడల్ లిస్ట్ అంటూ తెలుస్తుంది . అమెరికాలో జాబ్ చేస్తున్న రక్షిత రెడ్డి .. ప్రజెంట్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటుంది..!!