ఈ మధ్యకాలంలో సొసైటీలో మనం ఎలాంటి సంఘటనలు చూస్తున్నాము అందరికీ తెలిసిందే . ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు పట్టుమంటే పది కాలాలు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకుంటున్నారు . దానికి మెయిన్ రీజన్ వాళ్ళు మధ్య ప్రేమ లేకపోవడమే. ఏదో వయసులో ఆకర్షణ పుట్టి ఆ కోరికను ఆ మోజును తీర్చుకోవడానికి ప్రేమ అనే పేరు పెట్టుకొని పెళ్లిళ్లు చేసుకొని ఆ మోజు తీరాక దూరమైపోతున్నారు. అయితే మరి కొంతమంది అమ్మాయిలు మరింతగా బరితెగించి..అసలు పెళ్లి వద్దని పిల్లలు కావాలంటే వేరే మార్గంలో కంటామంటూ బోల్డ్ గా మాట్లాడుతున్నారు.
మరి కొంతమంది అమ్మాయిలు పెళ్లంటేనే చీదరించుకొని దూరం పెడుతున్నారు . అయితే మరి కొంత మంది జంటలు మాత్రం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు . కానీ పిల్లలు ను కన్నాలంటే తమ అందాలు పాడైపోతాయని సరోగసి , ఐవిఎఫ్ ద్వారా పిల్లలు కనడానికి ట్రై చేస్తున్నారు . ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువ మంది జంటలు సరోగసి ఐవిఎఫ్ ల ద్వారనే పిల్లలు కనడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు . ఇలాంటి వాళ్లపై సంచలన కామెంట్స్ చేసింది ఒకప్పటి హీరోయిన్ రాధిక .
మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న రాధిక అంటేనే అందరికీ చాలా ఇష్టం . ఉన్నది ఉన్నట్లు ముఖానే మాట్లాడి అడిగి కడిగే సత్తా ఉన్న హీరోయిన్ . కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన రాధికాకు “ప్రెసెంట్ సొసైటీలో ఉన్న మ్యారేజ్ వ్యవస్థ గురించిన ప్రశ్న ఎదురయింది”.. రాధిక మాట్లాడుతూ ..”ఈ మధ్యకాలంలో యువత ఎక్కువ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ..వాళ్లకు పెళ్లి అంటేనే ఓ పెద్ద సమస్యగా అయిపోయిందని ..రీసెంట్ గా నేను కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడాలని.. వాళ్ళలో హీరో హీరోయిన్లు కూడా ఉన్నారని ..అయితే వీళ్లంతా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం దేనికి ..లైఫ్ ఎంజాయ్ చేయాలి.. పిల్లలు కావాలి అనుకుంటే సరోగసి , ఐవిఎఫ్ లాంటి ఎన్నో కొత్త పద్ధతులు ఉన్నాయి కదా “అంటూ చెప్పుకొస్తున్నారు .
అంతేకాదు కొంతమంది ఆడవాళ్లు పిల్లలు కవాలంటే మగవాళ్ళ అవసరం ఏముంది అంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆలోచించే పద్ధతి తప్పు అని నాకు తెలుసు అయినా అది వాళ్ళకి చెప్తే చెప్పిన అర్థం చేసుకోలేరు అంటూ చెప్పుకొచ్చింది . దీంతో సీనియర్ నటి రాధిక చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.