కాజల్ అగర్వాల్ టాలీవుడ్లో పదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగింది. నార్త్ ముద్దుగుమ్మ అయినా కూడా కాజల్ మగధీర సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వరుస పెట్టి అందరి స్టార్ హీరోలతోనూ నటించింది. మహేష్, బన్నీ, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు జోడీగా చాలా సినిమాల్లో నటించింది. అటు కోలీవుడ్‌లోనూ స్టార్ హీరోలకు జోడీ కట్టింది.
ఇక రెండేళ్ల క్రితం మెగాస్టార్ ఆచార్య సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపికైనా కూడా అప్పుడే పెళ్లి కావడంతో ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఆమె ఓ పిల్లాడికి తల్లి కూడా అయ్యింది. సంసార జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తోంది. కాజల్‌కు పెళ్లయ్యి.. ఓ బిడ్డకు తల్లి అయినా కూడా ఆమెలో ఛరిష్మా అయితే తగ్గలేదు. ఇప్పుడు కూడా ఆమెకు ఓ అదిరిపోయే బంపర్ ఆఫర్ వచ్చింది.
కాజల్ కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా అదిరిపోయే క్రేజీ కాంబినేషన్లో ఆమెకు లక్కీ ఛాన్స్ దక్కింది. బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. శ్రీలీల బాలయ్యకు కూతురుగా నటిస్తుండగా… బాలయ్య 50 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిగా ఈ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ పాత్రకు జోడీగా ఆల్రెడీ పెళ్లయ్యి ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అయితే బాగా సెట్ అవుతుందనే ఆమె పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యతో పాటు సీనియర్ హీరోలకు సరైన హీరోయిన్లు సెట్ కావడం లేదు. ఈ టైంలో ఆమెకు బాలయ్య సినిమాలో ఛాన్స్ వస్తే.. తర్వాత సీనియర్ హీరోలకు జోడీగా, మంచి ఆప్షన్‌గా సెట్ అవుతుందనడంలో సందేహం లేదు.