స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఏం చేసినా ఓ సంచలనం అవుతోంది. నాగ చైతన్యతో ప్రేమ ఆ తర్వాత పెళ్లి అనూహ్యంగా విడాకులు. తలుచుకుంటేనే సమంత లైఫ్ ఓ మిరాకిల్. ఇంట్లో ఖర్చుల కోసం 500 ఇస్తానంటే వెల్కం గర్ల్‌గా పనిచేసింది. అలాంటి సమంత ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఎంతో మందికి సహాయం చేస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా అనాధలను ఆదుకుంటోంది.
తోటి నటులకి కావాల్సిన సహాయం చేస్తోంది. అయినా తనను బూతద్దంలో పెట్టి చూస్తున్న వారెందరో ఉన్నారు. సమంత గ్లామర్ పాత్రలు చేసినా బికినీ ధరించినా, డీప్ లిప్ లాక్స్ ఇచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సమంతకి బాగా ఉన్నారు. అందరు పెద్ద హీరోలతో మాత్రమే సమంత రొమాన్స్ చేసిందనుకుంటే పొరపాటే. అటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
అలాగే తమిళంలో సూర్య, విజయ్, ధనుష్‌లతో మాత్రమే కాదు విజయ్ సేతుపతి లాంటి వారితోనూ నటించింది. నాని సరసన నటించిన సమంత మాజీ భర్త నాగ చైతన్యతో చేసిన రొమాన్స్ మాత్రం ఊహించనిది. కథ, తన పాత్ర నచ్చితే సమంత ఏ హీరో పక్కన అయినా..ఎలాంటి పాత్రలోనైనా ఎంత గ్లామర్‌గా అయినా నటిస్తుంది.
ముఖ్యంగా ది ఫ్యామిలీ మేన్ సీజన్ లో సమంత ఇంటిమేట్ సీన్స్‌లో పర్ఫార్మెన్స్ అల్టిమేట్. సమంత ఈ స్థాయికి చేరుకుందీ అంటే ఒప్పుకున్న కథలో తన పాత్రనే ఊహించుకోవడం. అది అందరికీ సాధ్యపడని విషయం. పక్కా ప్రొఫషనల్‌గా ఉండే సమంత హాలీవుడ్లో లెస్బియన్ పాత్ర చేయడానికి కారణం కథ మాత్రమే. కానీ, నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతను ఎవరూ అలా చూడటం లేదు.