Newsఅసలు నేను చేసిన తప్పేంటి..? చెప్పండి.. ఫస్ట్ టైం ఆ విషయంపై...

అసలు నేను చేసిన తప్పేంటి..? చెప్పండి.. ఫస్ట్ టైం ఆ విషయంపై ఓపెన్ అప్ అయిన సమంత..!!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ సమంత పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా అక్కినేని హీరో నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత పేరు సోషల్ మీడియాలో రోజుకో విధంగా ట్రోల్ అవుతూనే ఉంది . అయితే ఆ విషయాలను ఏమాత్రం పట్టించుకోని సమంత ..తన లైఫ్లో ముందుకు కొనసాగుతుంది .

రీసెంట్ గానే మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని బయటపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దక్షిణ కొరియాలో ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సమంత త్వరలోనే తన నెక్స్ట్ సినిమా విజయ్ దేవరకొండతో చేయబోతున్న ఖుషి సెకండ్ షెడ్యూల్లో పాల్గొన బోతుంది . కాగా చాలా కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ “మీరు త్వరగా పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని.. మీపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలని కోరుకుంటున్నాను” అంటూ కామెంట్ పెట్టాడు.

దీనికి రిప్లై ఇస్తూ సమంత..” మీ ఆశీస్సులు మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి ..మీ సపోర్ట్ ఉంటే త్వరగా కోలుకుంటాను ..నాపై విమర్శలా..? ఏంటవి..?” అంటూ తెలిసి తెలియనట్లే కౌంటర్ ఇస్తూ అసలు విషయం అడిగేసింది. అంటే దీనిబట్టి సమంత తప్పు ఏం చేయలేదని ..సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని చెప్పకనే చెప్పేసింది సమంత అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు . ఏది ఏమైనా సరే సమంత చాలా రోజుల తర్వాత అభిమానులతో ఇలా ముచ్చటించడం హ్యాపీగా ఉంది అంటున్నారు మరి కొంతమంది ఫ్యాన్స్..!!

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news