టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ జమున నిన్న అనారోగ్య కారణంగా మరణించిన విషయం తెలిసిందే. కాగా తెలుగు వారికి సత్యభామగా సుపరిచితురాలైన జమున ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్రను వేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . శ్రీనివాసరావు – కౌసల్య దేవి దంపతులకు 1936లో ఆగస్టు 30న హంపిలో జన్మించిన జమున సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది . మరీ ముఖ్యంగా ఎలాంటి పాత్రనైనా చేయడంలో జమున నెంబర్ వన్ అంటూ అప్పట్లో డైరెక్టర్స్ చెప్పుకొచ్చేవాళ్ళు .
అంతేకాదు అప్పట్లో సావిత్రి తర్వాత నెంబర్ వన్ హీరోయిన్ ఎవరా అంటే అందరు చెప్పే పేరు జమున. తెలుగు , తమిళ్, కన్నడ , మలయాళం తోపాటు హిందీలో ను నటించి మెప్పించింది. పలు ప్రతిష్టాత్మక సినిమాలలో నటించి శభాష్ అనిపించుకున్న జమున.. దాదాపు 200 సినిమాలకు పైగా నటించి ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది జమున.
హరనాధ్ తో ప్రేమలో పడినా జమున..రంగారావు గారి వార్నింగ్ తో లెక్చరర్ రమణారావు ను పెళ్లి చేసుకున్న జమున కి ఒక్క పాప, ఒక్క బాబు. కాగా నిజానికి జమునకు తన కూతురు స్రవంతిని హీరోయిన్ చేయాలి అనుకున్నిందట. స్క్రీన్ పై హీరోయిన్గా చూడాలని ఇండస్ట్రీలోకి రానిచ్చాలనుకునిందట . అయితే ఇండస్ట్రీలో ఉండే అసలు రంగు తెలుసుకున్న ఆమె కూతురు హీరోయిన్ అవడం ఇష్టం లేక అమ్మ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట . అలా మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న జమున తన కోరిక తీరకుండానే మరణించింది అంటూ జనాలు బాధపడుతున్నారు . ఏది ఏమైనా సరే జమున మన మధ్య లేరు అన్న వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టం . ఆమె ఆఖరుగా నటించిన చిత్రం అన్నపూర్ణమ్మ గారి మనవడు 2021 జనవరి 29న విడుదలైంది..!!