ఊర్మిళ మండోత్కర్ అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది రెండే. అవి ఒకటి వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ..రెండు రంగీలా సినిమా. అంతగా ఆర్జీవీ..ఆయన తీసిన రంగీలా సినిమాల ప్రభావం ఊర్మిళపై పడ్డాయి. ఆర్జీవీ సీజన్ లాంటి వాడు. సీజన్‌ను బట్టి అభిరుచులు మారుటుంటాయన్నట్టుగా ఆర్జీవీకి ఒక స్టేజ్‌లో ఒకరు మాత్రమే నచ్చుతారు.
ఆ తర్వాత ఇంకొకరు. అప్పట్లో ఊర్మిళ అంటే ఆర్జీవీకి విపరీతమైన మోజు ఉండేది. కొన్నేళ్ళ పాటు ఆమెతో రిలేషన్‌లో ఉన్నారు. అసలు వర్మ తన రంగీలా సినిమాలో ఊర్మిళను ఇష్టమొచ్చినట్టు చూపించేశాడు. ఆమె అందాలు మొత్తం బయట పెట్టేసి దేశం మొత్తం ఆమెకు ఫిదా అయిపోయేలా చేశాడు. ఆ తర్వాత నాగార్జున – ఊర్మిళ కాంబినేషన్లో కూడా సినిమాలు చేశాడు.
అలా ఊర్మిళను పర్మినెంట్‌గా వాడుకుంటోన్న టైంలోనే వర్మకు శ్రీదేవి అంటే కూడా విపరీతమైన ఇష్టం, గౌరవం ఉండేది. చెప్పాలంటే అప్పటికే శ్రీదేవి ఓ పెద్ద స్టార్ అయినా ఆర్జీవీ లాంటి అప్‌కమింగ్ డైరెక్టర్ మీద నమ్మకం పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం గొప్ప విషయం. తెలుగులో ఆర్జీవీ శ్రీదేవితో క్షణ క్షణం, గోవిందా గోవిందా లాంటి సినిమాలు తీశారు.
కేవలం శ్రీదేవి కోసమే ఈ సినిమాలు తీశానని ఒప్పుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే, ఒకదశలో శ్రీదేవీ తనతో ఎంతో సన్నిహితంగా ఉంటూ తన మూవీ అండ్ పర్సనల్ అప్‌డేట్స్ అన్నీ చర్చించేది. ఒకరకంగా ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. శ్రీదేవికి కూడా ఆర్జీవీ అంటే చాలా ఇష్టమని..కానీ, అప్పటికే ఆర్జీవీ ఊర్మిళతో రిలేషన్‌లో ఉండటం వల్ల ఈ అందాల తార గురించి అంత లోతుగా ఆలోచించలేదట.
బోనీ కపూర్ ప్రపోజల్ కూడా ఆర్జీవీకి చెప్పిందట శ్రీదేవి. కొన్ని బలవంతమైన పరిణామాల మధ్య శ్రీదేవి బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట. నిజంగా అప్పట్లో ఊర్మిళ కాకుండా ఆర్జీవీ ప్రయాణం అతిలోక సుందరితో కొనసాగి ఉంటే ఇప్పుడు మన కళ్ళముందు ఉండేదేమో.