తెలుగు, తమిళ చిత్ర సీమల్లో .. క్యామెడీ జోడీగా వెండి తెరను కుదిపేసిన.. నాటి తరం క్యారెక్టర్ ఆర్టిస్టులు గీతాంజలి, పద్మనాభం.. గురించి.. అనేక విషయాలు అప్పట్లో చర్చకు వచ్చేవి. ఇద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం..దాదాపు 100 కు పైగా చిత్రాల్లో జోడీకట్టడం.. ఈ ఇద్దరూ లేకుండా.. ఒక దశాబ్దంపాటు.. అసలు క్యామెడీని పండించే అవకాశం లేకపోవడం.. వంటివి విశేషం.
ఈ క్రమంలోనే గీతాంజలి-పద్మనాభాల మధ్య ఏదో ఎఫైర్ ఉందని.. పెద్ద ఎత్తున చర్చకు వచ్చేది. కొన్ని కొన్ని స్థానంలోఎన్నో గ్యాసిప్‌లను విలేకరులు వండివార్చేవారు. ఇద్దరూ ఒకే కారు యూజ్ చేస్తున్నారని.. స్టూడియోలకు కూడా.. ఇద్దరూ కలిసే వస్తున్నారని.. పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి. అంతేకాదు.. అప్పట్లో పద్మనాభం సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకుని.. సినిమాలు తీసేవారు.
ఆ సినిమాల్లో కొన్ని జానపదాలకు సంబంధించి కొన్ని సాంఘికాలకు సంబంధించిన చిత్రాలు ఉండేవి. అయితే.. ఏ సినిమాలో అయినా.. ఏదో ఒక పాత్రను గీతాంజలి పోషించేవారు. ఇది కూడా రూమర్స్‌కు పెద్దపీట వేసింది. అయితే.. పద్మనాభం బాగా చదువుకున్న వ్యక్తి కావడంతో వీటిని పట్టించుకునేవారు కాదు. గీతాంజలి డేరింగ్ పర్సనాలిటీ. దీంతో ఆమె కూడా చదువుకుని వదిలేసేవారు.
అయితే.. అప్పట్లో జెమినీ.. వాహినీ వంటి సంస్థలు మాత్రం రూమర్స్‌ను అస్సలు సహించేవికావు. విలేకరుల మీటింగ్ పెట్టిమరీ.. చక్రపాణి, బీఎన్ రెడ్డి వంటి వారు.. ఇలా రూమర్స్ రాస్తే.. ఏం వస్తుంది? వారి జీవితాలతో ఆడుకోవడం కూడా ఒక వార్తేనా? ఇక మీదట మా స్టూడియోలకు సంబంధించిన వార్తలు రాయొద్దు. అని తెగేసి చెప్పేశారట. అంతేకాదు.. ఈ క్రమంలోనే చక్రపాణి బొమ్మరిల్లు అనే మాస పత్రికను తీసుకువచ్చి.. సినీ విశేషాలను అందించేవారు. ఇదీ.. సంగతి..!