తెలుగు సినిమాల స్థాయిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన ఏకైక సినిమా బాహుబలి . బాహుబలి సిరీస్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఇప్పటికి తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రపంచ దేశాలలో ముందుగా వినిపించే పేరు బాహుబలి . ఈ సినిమాను డైరెక్ట్ చేసిన రాజమౌళి ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని విపరీతమైన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు . అంతేనా తెలుగు ఇండస్ట్రీ అంటే నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళిని అంటూ స్టార్ హీరో సైతం బల్ల గుద్ది చెబుతున్నారు .
ఇప్పుడు ఏ పక్క భాష ఇండస్ట్రీకి వెళ్లిన ఫస్ట్ వినిపించే పేరు రాజమౌళి ..ఆ తర్వాతే మిగతా హీరోల పేర్లు వినిపిస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు . కాగా ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ టెక్నిషన్స్ అందరికీ ప్రత్యేక గుర్తింపు లభించింది . కాగా రీసెంట్ గానే ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రభాస్ కి ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి బాహుబలి కారణం అంటూ ప్రభాస్ సైతం ఒప్పేసుకున్నాడు. కాగా ఇదే మూమెంట్లో ప్రభాస్ – అనుష్క పెళ్ళి మ్యాటర్ ట్రెండ్ అవుతుంది. ఇదే టైంలో గతంలో రాజమౌళి అనుష్క గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
బాహుబలి ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ ..”అనుష్క ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ నా స్టోరీ నా కథ అనుకున్నానని కానీ . అనుష్క ఈ సినిమాకి చేయడానికి మెయిన్ రీజన్ ప్రభాస్ అని.. ఈ సినిమాను ను ఎందుకు యాక్సెప్ట్ చేశావు అని అడిగినప్పుడు అనుష్క.. రమా రాజమౌళి , వల్లి, కీరవాణి, ప్రభాస్ వీళ్ళందరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని మీరందరూ మంచి టూర్లా.. పిక్నిక్ లా ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను ఎలా తట్టుకుంటాను అందుకే ఈ సినిమాని యాక్సెప్ట్ చేశానని చెప్పుకొచ్చింది.. అప్పుడే నాకు అర్థమైంది అనుష్క నా కథ విని స్టోరీని ఓకే చేయలేదు ఎంజాయ్ చేయడానికి ఈ సినిమాలు చేసింది అని” అంటూ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అంటే ఈ రకంగా చూసుకుంటే అనుష్కకి కూదా ప్రభాస్ అంటే ఇష్టమే అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే మళ్లీ సోషల్ మీడియాలో ప్రభాస్ – అనుష్క పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.