Moviesఅనుష్కతో ప్రభాస్ బ్రేకప్..ఇంతకన్నా సాక్ష్యం కావాలా బ్రదర్స్..!

అనుష్కతో ప్రభాస్ బ్రేకప్..ఇంతకన్నా సాక్ష్యం కావాలా బ్రదర్స్..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌య‌స్సు 43. టాలీవుడ్‌లోనే కాదు… ఇండియాలో సినిమా స్టార్స్‌లో స‌ల్మాన్‌ఖాన్ త‌ర్వాత మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న‌ది ప్ర‌భాస్ మాత్ర‌మే. స‌ల్మాన్ ఇప్ప‌ట‌కీ ఈ వ‌య‌స్సులో కూడా స్టిల్ బ్యాచిల‌ర్‌గా ఉంటూ ఇండియాలోనే ఇప్ప‌ట‌కీ పెళ్లికాని బ్ర‌హ్మ‌చారుల్లో ముందు వ‌రుస‌లో ఉన్న ఏజ్‌బార్ హీరోగా ఉన్నాడు. ఆ త‌ర్వాత ప్లేస్ ఖ‌చ్చితంగా ప్ర‌భాస్‌దే. ఎప్పుడో 2002లో జ‌యంత్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈశ్వ‌ర్ సినిమాతో ప్ర‌భాస్ హీరో అయ్యాడు.

ఆ సినిమా వ‌చ్చి ఇప్ప‌ట‌కీ 20 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు ప్ర‌భాస్ ముదిరిపోయాడు. ఇప్ప‌టికే పెళ్లి వ‌య‌స్సు దాటిపోయింది. మ‌రి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియ‌ట్లేదు. రీసెంట్‌గా అన్‌స్టాప‌బుల్ షోలో బాల‌య్య అడిగిన ప్ర‌శ్న‌కు కూడా ప్ర‌భాస్ పెళ్లి ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్పినా అది ఎప్పుడు ? అమ్మాయి ఎవ‌రు ? అన్న‌ది మాత్రం చెప్ప‌లేదు.

ఇక ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అనుష్క పెళ్లి ప్ర‌స్తావ‌న కూడా వ‌స్తూ ఉంటుంది. అనుష్క వ‌య‌స్సు కూడా 40కే చేరువ అవుతున్నా ఆమె ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. ఇక వీరిద్ద‌రికి సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే లెక్క‌లేన‌ని సార్లు పెళ్లి చేసి ప‌డేశారు. ప్ర‌భాస్ మ‌న‌సులో ఒక అమ్మాయి అయితే ఉంది.. అది ఎవ‌రు ? అన్న‌ది బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఇక బాల‌య్య త‌న షోలో కృతిస‌న‌న్‌తో ప్రేమ‌లో ఉన్నావా ? అంటే తాము ఇద్ద‌రం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేశాడు.

ఇదిలా ఉంటే ఓ ఇంట్ర‌స్టింగ్ టాపిక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌భాస్‌కు ఇన్‌స్టాలో ఏకంగా 9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఓ టాలీవుడ్ హీరో ఈ రేంజ్‌లో ఫాలోవ‌ర్ల‌ను క‌లిగి ఉండ‌డం బ్లాక్‌బ‌స్ట‌ర్ క్రేజ్‌కు నిద‌ర్శ‌నం. అంత మంది ఫాలోవ‌ర్స్‌ను క‌లిగి ఉన్న ప్ర‌భాస్ ఇన్‌స్టాలో కేవ‌లం 16 మందినే ఫాలో అవుతున్నాడు. ఆ 16 మంది కూడా ప్ర‌స్తుతం ఆయ‌న‌తో వ‌ర్క్ చేస్తున్న వాళ్లే.. గ‌తంలో ప‌నిచేసిన వారే ఉన్నారు.

తన పెదనాన్న కృష్ణంరాజు కాకుండా దర్శకుడు సందీప్ వంగ, సన్నీ సింగ్, కృతి సనన్, ఎడిటర్ బ్రాకమోంటెస్, నాగ్ అశ్విన్, దర్శకుడు రాధాకృష్ణ, శృతిహాసన్, ప్రశాంత్ నీల్, అమితాబ్, దర్శకుడు ఓం రౌత్, దీపికా పదుకొనే, సీనియ‌ర్ న‌టి భాగ్య శ్రీ, పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్, సుజీత్ ఉన్నారు. ఇందులో అనుష్క లేదు. అంటే అనుష్క‌కు, ప్ర‌భాస్‌కు మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిందా ? అస‌లేం జ‌రిగింద‌న్న కొత్త డౌట్లు నెటిజ‌న్ల‌లో పుట్టుకు వ‌స్తున్నాయి. మ‌రి కృతీస‌న‌న్ విష‌యంలో క్లారిటీ ఇచ్చిన ప్ర‌భాస్ అనుష్క విష‌యంలో ఏం చేస్తాడో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news