సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ పై ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే . ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ స్టార్ సెలబ్రిటీస్ ను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు కొందరు నెటిజన్స్. ఈ క్రమంలోనే అలాంటి బాధలను భరించలేక ట్రోలింగ్ తట్టుకోలేక కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ సోషల్ మీడియా నుండి బయటకు వచ్చేస్తున్నారు .
ఇప్పటికే చాలామంది అదే పని చేశారు . కాగా స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న కొరటాల శివ సైతం ఇలాంటి చెత్త ట్రోలింగ్ బాధలను భరించలేక సోషల్ మీడియా నుండి బయటకు వచ్చేశారు . పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ కూదా అదే పని చేశారు. కే జి ఎఫ్ చిత్రాలతో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ రీసెంట్గా తన ట్విట్టర్ అకౌంట్ ని క్లోజ్ చేశారు .
సోషల్ మీడియాలో అప్పుడప్పుడైనా యాక్టివ్ గా ఉంటూ తన సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉండే ప్రశాంత్ ఇలా ఎందుకు సడన్గా సోషల్ మీడియా నుంచి దూరమయ్యాడు అనేది .. అర్థం కావడం లేదు. అంతేకాదు ప్రశాంత్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు . ఇంత అకస్మాత్తుగా ఎందుకు ఇలాంటి దారుణ్మైన నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా సరే జనాలకి స్టార్ సెలబ్రెటీస్ కి మధ్య కామన్ మీడియా ఈ సోషల్ మీడియా . మరి ఇలాంటి వాటికి ఆయన దూరమవ్వడం డైరెక్టర్ గా ఎదుగుతున్న ఆయన కెరియర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో..?