సోనియా అగర్వాల్..తమిళ, తెలుగు భాషలలో మాత్రమే కాకుండా మొత్తం సౌత్ భాషలలో అలాగే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాల్సిన హీరోయిన్. కానీ, కాలక్రమేణ కొందరు హీరోయిన్స్ తప్పులు చేసి మొత్తం కెరీర్‌నే నాశనం చేసుకుంటారు. అలా అద్భుతమైన కెరీర్‌ను పాడుచేసుకున్న వారిలో సోనియా అగర్వాల్ ఒకరు. ఈమె పర్ఫార్మెన్స్ పరంగా మంచి నటిగా తమిళంలోనూ, తెలుగులోనూ పేరు తెచ్చుకుంది.
సోనియా అగర్వాల్ స్కూల్ డేస్‌లోనే జీ టీవీలో సీరియల్‌లో నటించే అవకాశం అందుకుంది. ఈ సీరీయ్ల్ తనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2002 లో నీ ప్రేమకై అనే తెలుగు సినిమా ద్వాతా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చందు అనే కన్నడ సినిమాలో సుదీప్ కి జంటగా నటించి కన్నడ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా చూస్తే దర్శకుడు సెల్వరాఘవన్ 2003 లో ఆయన దర్శకత్వంలో వచ్చిన కాదల్ కొండేన్ సినిమాలో అవకాశం ఇచ్చారు.
ఇదే సినిమా తెలుగులోనూ అల్లరి నరేష్ హీరోగా నేను అనే పేరుతో రీమేక్ అయింది. ఇక సోనియా తమిళ స్టార్ హీరోలతో జతకట్టి ఆకట్టుకుంది. ఈ మూవీస్ తర్వాత సోనియా కెరీర్ మలుపు తిప్పింది అంటే 7/జి బృందావన్ కాలనీ. ఆ తరువాత తిరుట్టు పాయలే, పుదుపేట్టై అనే సినిమాలు నటించింది. ఈ రెండు సినిమాలలో ఒకటి ఫ్లాప్, ఒకటి హిట్. ఇలా పూర్తిగా సినిమాలతో బిజీగా ఉన్న సోనియా దర్శకుడు సెల్వరాఘవన్ ని పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం జరిగిపోయాయి.
ఈ ప్రభావం సోనియా సినిమా కెరీర్ మీద తీవ్రంగా ప్రభావం చూపించింది. స్టార్ హీరోయిన్‌గా మొత్తం సౌత్‌లో ఓ ఊపు ఊపాల్సింది అసలు అవకాశాలే లేక అల్లాడుతోంది. భారీ ఎద అందాలు..అద్భుతమైన నాభి సోయగంతో చమటలు పట్టించిన సోనియా కెరీర్ ఇలా అయిపోవడం కేవలం తను పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయమే.