ఫైనల్లీ ఎట్టకేలకు భారతీయుల చిరకాల కోరిక నెరవేరబోతుంది . ఆస్కార్ కి ఒక్క అడుగు దూరంలో ఉంది మన తెలుగు సినిమా . దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోస్ తారక్ – చరణ్ తో కలిసి మల్టీస్టారర్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది.
పెట్టిన దానికి డబుల్ కాదు ట్రిపుల్ రేంజ్ లో లాభాలు తీసుకొచ్చి సెన్సేషనల్ రికార్డును నెలకొల్పింది. కాగా భారతీయులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన ఆస్కార్ నామినేషన్స్ కి ఆరారార్ నామినేట్ అయింది . ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉంది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో టెలివిజన్ లో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.
అయితే ఇలాంటి తరుణంలోనే ఆస్కార్ కోసం రాజమౌళి ఏకంగా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . పైకి ఆస్కార్ అవార్డు మాత్రమే కనిపించిన ఆస్కార్ కి నామినేట్ అవ్వాలంటే బ్యాగ్రౌండ్ లో చాలా వెరిఫికేషన్ వుంటాయి . జనరల్ కేటగిరిలో ఆస్కార్ కోసం పోటీ అవకాశం అమెరికాతోపాటు ఇతర దేశాల సినిమాలకు కూడా ఉంది. అయితే ఆ సినిమా 2022జనవరి 1 నుంచి, డిసెంబర్ 31 వరకు ఆ ఏడాదిలోపు థియేటర్లలో విడుదలై ఉండాలి.
అమెరికాలో ఆస్కార్ కమిటీ నిర్ణయించిన ఆరు ఏరియాల్లో ఏడు రోజులపాటు ఒక్క థియేటర్లో ప్రదర్శించబడి ఉండాలి. సినిమా 40 నిమిషాల కంటే ఎక్కువ నిడివితో, 35ఎంఎం, 70ఎంఎం ఫార్మాట్‌లో తీసి ఉండాలి. సినిమాలో ఫారెన్ లాంగ్వేజ్ వర్డ్స్ 50శాతం అయినా ఉండాలి.బోలెడు రూల్స్ అన్ని పకడ్బందీగా పక్కాగా ప్లాన్ చేసుకొని మరి రాజమౌళి సక్సెస్ఫుల్గా తన సినిమాను ఆస్కార్ కి నామినేట్ చేశాదు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కొడుతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 2023కిగానూ ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నాటు నాటుపాటకిగానూ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందింది. ఆస్కార్ అవార్డుకి ఒక్క అడుగు దూరంలో ఉంది.