పేకేటి శివరావ్. ఈయన ఇప్పటి తరానికి తెలియని నటుడు. కానీ, మంచి ప్రతిభ ఉన్న ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. 1950-70 ల మధ్య శివరామ్.. ఎంత బిజీ అంటే.. కనీసం ఇంటికి కూడా వచ్చేవారు కాదట. ప్రతి సినిమాలోనూ ఆయన పాత్ర ఉండాల్సిందే. నాగేశ్వరరావు దేవదాసు సినిమాలో `మనవాడు తలుచుకుంటే` అనే డైలాగు అప్పట్లో ఫుల్ ఫ్యామస్. ఈ డైలాగ్ రాసుకుంది కూడా శివరావేనని అంటారు.
అంతేకాదు.. నటశేఖర కృష్ణ నటించిన అల్లూరి సినిమాలోనూ బ్రిటీషర్‌గా నటించి..మెప్పించాడు. అలాంటి నటుడికి ఒక సందర్భంలో రూమ్ లేకపోవడం విషాదం. ఎందుకంటే.. ఆయన రూం రెంట్ కట్టేవారు కాదట. డబ్బులు లేకకాదు. ఉండికూడా.. ఖర్చులకు అట్టిపెట్టుకునేవారట. దీంతో ఎక్కడ రూం ఇచ్చినా.. అద్దె కట్టకపోవడంతో ఖాళీ చేయాలనే ఒత్తిళ్లు వచ్చేవి.
దీంతో ఎక్కువ కాలం సినిమా షూటింగులు అయిపోయిన తర్వాత.. ఆ స్టూడియోల్లోనే ఉండిపోయేవారని గుమ్మడి రాసుకున్నారు. “ఓ సమయంలో వాహినీ స్టూడియోను మరమ్మతు చేయాలని నిర్ణయించి శివరావ్‌ను వెళ్లిపోమన్నారు. ఆయన నా రూమ్‌కు వస్తానన్నాడు. కానీ, నేను అప్పటికే పెళ్లి చేసుకుని, భార్యతో ఉంటున్నాను. దీంతో ఎన్టీఆర్ ఒక్కరే ఉంటున్నారు. అక్కడ ట్రై చేయమని చెప్పాను.
అయితే, శివరావ్ తక్కువవాడు కాదు. ఆ పనేదో నన్నే చేయమన్నాడు. ఇదే విషయాన్ని నేను ఎన్టీఆర్ చెప్పాను. కానీ, ఆయన వద్దన్నాడు“ అని `గుమ్మడి చేదు గురుతులు.. తీపి జ్ఞాపకాలు` పుస్తకంలో రాసుకొన్నారు. మరి ఎందుకు ఎన్టీఆర్ వద్దన్నారు అనే ప్రశ్న చాలా రోజులు తనను వేధించిందని గుమ్మడి చెప్పారు. చివరకు ఉండబట్టలేక.. “మీతో ఎన్నో సినిమాల్లో నటించాడు. పాపం రూం అడిగితే వద్దన్నారేం! అని ఉండబట్టలేక అడిగేశాను. దీనికి ఎన్టీఆర్.. కొందరు పైకి బాగానే ఉంటారు. మనసు మాత్రం ఇబ్బంది అందుకే వద్దన్నాను“ అన్నారు.
అయితే ఎన్టీఆర్ అలా ఎందుకు ? అన్నారో తనకు తర్వాత తర్వాత తెలిసింది.. శివరావ్.. కొన్ని కొన్ని విషయాల్లో.. చేసిన ఘటనలు. చివరి రోజుల్లో ఆయనను ఎవరూ చేరనివ్వలేదు. అని రాసుకొచ్చారు.