భానుమతి గడుసు తనానికి ప్రతీక అనే విషయం తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించిన మాట. అయితే. అన్నగారితో మల్లీ శ్వరి.. తర్వాత.. జానపద నేపథ్యం ఉన్న మహామంత్రి తిమ్మరుసు.. వంటి సినిమాల్లో నటించారు. ఆమె పాటలు ఆమే పాడేవారు. మీ కంఠం బాగోలేదని.. ఎవరైనా… అంటే, కట్! డబ్బు అక్కడికక్కడే (అడ్వాన్స్) వెనక్కి ఇచ్చేసి వెళ్లిపోయారు. దీంతో ఎవరూ ఏమీ అనేవారు. అది తిమ్మరుసు షూటింగు జరుగుతున్న సమయం.. దీనిలో నాగయ్య కీలక పాత్ర. తిమ్మరుసుగా నటించారు.
ఒక సందర్భంలో నాగయ్యను అన్నగారు ఇదేప్రశ్న అడిగారు. ఎందుకంటే.. ఈ సినిమాలో “శ్రీకర కరుణాల వాల వేణుగోపాల“ అనే పాట ఉంది. ఇది.. భానుమతి పై చిత్రీకరించారు. అంతేకాదు.. ఆమే స్వయంగా ఆలపించిన పాట. అయితే.. ఈ పాటను వేరేవారితో పాడించాలనే చర్చ వచ్చింది. కానీ, భానుమతి ఒప్పుకోరని అన్నారు. దీనికి అన్నగారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. సినిమా షూట్ అయిపోయింది. ఈ పాట ఇప్పటికీ సూపర్ డూపర్ హిట్.
కానీ, సినిమా పాట పాడే సమయంలో భానుమతి అస్వస్థతతో ఉన్నారు. కానీ, పాట తానే పాడతానని పంతం పట్టారు. దీంతో రెండు సార్లుగా ఆ పాటను పాడించారు. ఈ తేడా మనకు పాటలో వినిపిస్తుంది కూడా.. తొలి చరణంలో ఉన్న గంభీరత.. రెండో చరణలో మరింత ఎక్కువగా ఉంటుంది. సరే.. దీనిపై నాగయ్యను అన్నగారు ఇదే ప్రశ్న సంధించారు.
ఎందుకు ఆవిడకింత పంతం..? అని అడిగారు.. దీనికి నాగయ్య.. ఆమె అంతే.. తనలో అనేక కళలు ఉన్నాయి. ఇక్కడ తప్ప ఇంకెక్కడ ప్రదర్శిస్తుంది. అందుకే ఈ పంతం. దీనిని అలా కంటే.. ఆమె ఆసక్తిని మనం అర్ధం చేసుకోవాలి. అనేవారు. చిత్రంగా నాగయ్య కూడా తన పాటలు తనే పాడుకునేవారు.