సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటీమణి పవిత్రా లోకేష్‌ను పెళ్లి చేసుకుంటున్నట్టు నూతన సంవత్సరంం కానుకగా ఓ వీడియోతో రివీల్ చేశారు. అయితే నరేష్, పవిత్ర బంధాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తోన్న నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నరేష్, పవిత్ర పెళ్లి జరగనివ్వను అని ఆమె శపథం చేస్తున్నారు.
నరేష్‌తో వ్యక్తిగత బంధం విషయంలో ఆమె ఇప్పటికే కోర్టుల్లో న్యాయం పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. తనకు ఓ కొడుకు పుట్టాక నరేష్ ఎంతో టార్చర్ పెట్టాడని.. తనను వదిలించుకోవాలనే ఆలోచనతో నరేష్ ఎన్నో దారుణమైన ఆలోచనలతో తనను ఇబ్బంది పెట్టాడని ఆమె వాపోయింది. నా నుంచి కృష్ణ గారికి ప్రాణహానీ ఉందని ఓ లెటర్ రాయడంతో పాటు కృష్ణ గారి సంతకాన్నీ సైతం ఫోర్జరీ చేశాడని ఆమె వాపోయింది.
ఈ విషయం కృష్ణ గారికి కూడా తెలియదని.. తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని.. అయితే కృష్ణ గారి కుటుంబ పరువు, ప్రతిష్టలు దృష్టిలో పెట్టుకునే వాటిని బయట పెట్టలేదని రమ్య రఘుపతి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవిత్ర తొలిసారి కలిసినప్పుడు ఆమెకు తన చేతితోనే అన్నం పెట్టానని.. అయితే ఆమె ఇప్పుడు తనకు సున్నం పెట్టాలని చూస్తోందని విమర్శించారు.
నా కొడుకు నాన్న కావాలని అడుగుతున్నాడని.. అందుకే తాను నరేష్‌కు విడాకులు ఇవ్వాలని అనుకోవడం లేదని కూడా ఆమె చెప్పింది. ఇక దేవుడు లాంటి కృష్ణ గారితో కూడా తనకు అక్రమ సంబంధం అంటగట్టాడని నరేష్ నీచుడని ఆమె తెలిపింది. ఇక అంతకుముందు కూడా తన భార్యకు డ్రైవర్‌తోనే అక్రమ సంబంధం ఉందంటూ నరేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.