విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్నగారు ఎన్టీఆర్.. నటించిన అనేక వందల సినిమాల్లో చాలా వాటికి నంది అవార్డులు సొంతమయ్యాయి. అయితే.. కొన్ని నందులు మాత్రం ఆయన నటనకు కాకుండా.. ఆయనలో ఉన్న మరో ప్రతిభకు నడుచుకుంటూ.. వచ్చి.. ఆయన చేతుల్లో వాలాయి. అలాంటి నంది అవార్డు దక్కడం వెనుక ఒక చిత్రమైన కథ చాలా మందికి తెలియదంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు.. బ్యానర్‌పై నిర్మించిన సినిమా .. తల్లా-పెళ్లామా? . ఇది 1970లో వచ్చింది. ఈ సినిమాలో హీరోగా, దర్శకుడిగానే కాకుండా.. కథను కూడా అన్నగారే రెడీ చేసుకున్నారు. ఈ చిత్రం అనేక మలుపులు తిరుగుతుంది. ఇది కుటుంబ కథతోనే సాగినప్పటికీ.. దీనిని సామాజిక కోణంలోనూ తెరకెక్కించారు. ముఖ్యంగా ‘తెలుగుజాతి మనది’ అనే పాట ఈ సినిమాలో చాలా హైలెట్‌గా నిలిచింది.
ఒక ప్రధానలో హరికృష్ణ కూడా ఇందులో నటించడం గమనార్హం. హరికృష్ణ నటించిన సన్నివేశాలు సినిమాకే హైలెట్. ఈ చిత్రంలో మహమ్మద్ రఫీ పాడిన ఒక పాటను మాత్రం రంగుల్లో తీశారు. మద్యపాన దుర్వ్యసనాన్ని ఖండిస్తూ జాతీయ సమైక్యతను ప్రబోధించిన ఈ చిత్రానికి గాను ఉత్తమ కథకుడుగా అన్నగారు నంది అవార్డు అందుకున్నారు.
ఒక హీరో అందునా.. అగ్ర నాయకుడు కథారచయితగా మారి నంది అవార్డు అందుకున్న ఏకైక ఘటన తెలుగు సినీ రంగంలో ఇదే కావడం గమనార్హం. ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ దాటలేకపోవడమూ మరో రికార్డేనని చెప్పాలి. ఎన్టీఆర్ ఎన్నో అవార్డులు అందుకున్నా కూడా ఈ అవార్డు ఆయన కెరీర్‌లో ఎప్పటకీ స్పెషలే అని చెప్పాలి.