గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో నందమూరి తారకరత్న పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా నారా లోకేష్ యువగళం పేరిట చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న హఠాత్తుగా కుప్పకూలిపోయారు . ఈ క్రమంలోనే కార్డియాడిక్ అరెస్ట్ వచ్చింది అంటూ డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. ప్రెసెంట్ క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడిన తారకరత్న ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నట్లు బెంగళూరు డాక్టర్లు చెప్పకు వచ్చారు.
కాగా ఇలాంటి క్రమంలోనే నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి గురించి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే నందమూరి తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం నందమూరి ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు . అందుకే నందమూరి ఫ్యామిలీకి తారకరత్న దూరంగా ఉన్నాడు . కాగా 2012లో తారకరత్న పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు . అయితే అలేఖ్య రెడ్డికి అప్పటికే పెళ్లయిపోయింది . ఆమె భర్త ఎవరో కాదు టిడిపి మాజీ మాజీ మంత్రి ఎలిమిరెడ్డి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి .
అలేఖ్య రెడ్డి సందీప్ రెడ్డి వివాహం అంగరంగ వైభవంగా గ్రాండ్గా జరిగింది . అప్పట్లో అది ఓ సంచలనంగా మారింది. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా అతగాడికి విడాకులు ఇచ్చేసి లైఫ్ ను ముందుకు తీసుకెళ్తూ ఉండింది. అలాంటి టైం లోనే తారకరత్న తో పరిచయం ఏర్పడి ..ఆ పరిచయం స్నేహంగా ..స్నేహం ప్రేమగా మారి చివరకు పెళ్లి వరకు వెళ్ళింది.
అంతేకాదు ఈ దంపతులకు ఇప్పుడు ఒక కూతురు కూడా ఉంది. ప్రెసెంట్ అలేఖ్య రెడ్డి బెంగళూరులోని హాస్పిటల్లో ఉంటూ తారకరత్నను దగ్గరుండి చూసుకుంటుంది. కాగా ఇన్నాళ్లు తారకరత్నను దూరం పెట్టిన నందమూరి ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!