టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ, నాగార్జున మధ్య అంత సఖ్యత లేదన్నది నిజం. గత 10 ఏళ్లుగా వీరి మధ్య ఎందుకో ? ఎక్కడో గ్యాప్ అయితే వచ్చింది. వీరు కూడా ఎప్పుడు కలుసుకునేందుకు పెద్దగా ఇష్టపడరు. ఒకరి ఇంట్లో జరిగే కార్యక్రమాలకు మరొకరు హాజరు కూడా కారు. అయితే వైజాగ్‌లో సుబ్బరామిరెడ్డి నిర్వహించిన ఓ కార్యక్రమంలో నాగ్, బాలయ్య ఇద్దరూ పాల్గొన్నారు. అప్పుడు నాగ్ మాట్లాడుతూ బాలయ్యకు, నాకు మధ్య ఏదో గ్యాప్ ఉందన్న ప్రచారం ఉంది. దానికి అదంతా ట్రాష్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
పక్కనే ఉన్న బాలయ్య కూడా నవ్వుతూ నాగ్ చేతిలో చేయి వేశారు. నాగ్ క్లారిటీ ఇచ్చాడు సరే.. ఆ తర్వాత అయినా కూడా వీరిద్దరు సఖ్యతతో ఉన్న దాఖలాలు లేవు. ఏదైనా ఎంతోకొంత గ్యాప్ అయితే ఉందన్నది నిజం. బాలయ్య కూడా నాగ్‌తో ఎప్పుడూ కలిసేందుకు పెద్దగా ఇష్టపడుతున్నట్టూ లేదు. అన్‌స్టాపబుల్ షోలో ఎంతోమంది హీరోలతో ఆయన జర్నీ చేస్తున్నారు. పవన్, మహేష్ లాంటి వాళ్లను కూడా తన షోకు పిలిపించుకున్నాడు.
అయితే నాగ్ కనీసం ఆ షోకు కూడా వస్తున్నట్టు సంకేతాలు లేవు. ఇక ఇప్పుడు సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలు పోటీ పడుతున్నాయి. మధ్యలో దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన విజయ్ వారసుడు కూడా రేసులో ఉంది. దీంతో ఏపీ, తెలంగాణలో ఇప్పుడు మూడు సినిమాల కోసం థియేటర్ల వార్ నడుస్తోంది. బాలయ్య సినిమాకు రిలీజ్‌కు ముందే మంచి హైప్ వచ్చేసింది.
దీంతో పాటు ఇండస్ట్రీ జనాలు కొందరు, రాజకీయ నాయకులు బాలయ్య సినిమా కోసం ఎక్కువ థియేటర్లు బ్లాక్ చేసేలా చక్రాలు తిప్పుతున్నారు. థియేటర్ల రేసులో వీరసింహా కంటే వీరయ్య కాస్త వెనకపడిందన్న టాక్ వచ్చేసింది. అయితే ఇప్పుడు వీరయ్య కోసం కూడా కొందరు ఇండస్ట్రీ జనాలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే నాగార్జున కూడా తెరవెనక వీరయ్య థియేటర్ల కోసం చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది.
నాగార్జునకు పంపిణీ రంగంలో పట్టు ఉంది. ఆయన తన సినిమాలను అన్నపూర్ణ ద్వారా సొంతంగా రిలీజ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఏపీలో తనకు పట్టున్న కృష్ణా, గుంటూరు, వైజాగ్ ఏరియాల్లో చిరు వాల్తేరు వీరయ్యకు కాస్త ఎక్కువ థియేటర్లు వచ్చేలా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నాగ్‌కు చిరుతో చాలా మంచి అనుబంధం ఉంది.. బాలయ్యతో ఎంతైనా పొసగని పరిస్థితే ఉంది.
ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ సినిమాకు అనుకూలంగా థియేటర్ల కోసం లాబీయింగ్ నాగ్ గట్టిగానే చేస్తున్నట్టు భోగట్టా..! ఏదేమైనా వీరయ్య, వీరసింహా సినిమాల థియేటర్ల కోసం ఇండస్ట్రీ వాళ్లు, రాజకీయ నాయకుల లాబీయింగ్ అయితే మామూలుగా లేదు.