కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన వరీసు ( తెలుగులో వారసుడు) సినిమా ఈ నెల 11న వరల్డ్ వైడ్‌గా తమిళ్ వెర్షన్ రిలీజ్ అయ్యింది. అసలు వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలిపి వరీసును ఈ నెల 11నే రిలీజ్ చేయాలని ఈ సినిమా నిర్మాత దిల్ రాజు అనుకున్నారు. అయితే తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఉండడంతో ఈ సినిమాను 14కు మార్చారు. తమిళ్ వెర్షన్ మాత్రం 11న రిలీజ్ చేశారు. హిందీ వెర్షన్ 13న రిలీజ్ చేశారు. ఇలా ఒకే సినిమాను మూడు డేట్లలో మూడు భాషల్లో రిలీజ్ చేయడమే ఈ సినిమాకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి.
దీనికి తోడు తమిళనాడులో అజిత్ సినిమాతో పోలిస్తే సమానంగా 400 థియేటర్లలో మాత్రమే వరీసు రిలీజ్ అయ్యింది. అజిత్ తునివు కూడా 11నే రావడంతో విజయ్ సినిమాకు సోలో రిలీజ్ దక్కలేదు. దీంతో విజయ్ సినిమాకు ఫస్ట్ డే కేవలం రు. 46 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రు. 139 కోట్లు వస్తేనే బ్రేక్ ఈవెన్ అయినట్టు. అయితే ఈ సినిమాకు వచ్చిన టాక్‌తో ఆ వసూళ్లు రావడం.. వారసుడు బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టంగానే ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం విజయ్‌కే ఏకంగా దిల్ రాజు రు. 150 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చాడట. ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో టాప్ ప్లేస్‌కు వెళ్లిపోయాడు. కోలీవుడ్‌లో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరో విజయ్. పైగా రజనీ తర్వాత.. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రజనీ కంటే కూడా విజయ్‌కే ఓవర్సీస్‌తో పాటు పలు దేశాల్లో భారీ క్రేజ్ ఉంది.
ఇతర దేశాల్లోనూ విజయ్ సినిమాకు భారీ వసూళ్లు వస్తాయి. ఇటు సినిమాకు భారీగా ఖర్చు చేశాడు దిల్ రాజు. అటు విజయ్‌కు ఏకంగా రు. 150 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చాడు. ఇటు చూస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేదు. తమిళనాడులోనే టాక్ బాగోలేదు. ఇలాంటి టైంలో విజయ్ రెమ్యునరేషన్ పరంగా కూడా ముక్కుపిండి మరీ వసూలు చేయడంతో దిల్ రాజు విలవిల్లాడిపోతోన్న పరిస్థితే ఉంది.