Moviesనన్ను చంపినా అదే నిజం..ఆ స్టార్స్ అందుకు పనికి రారు.....

నన్ను చంపినా అదే నిజం..ఆ స్టార్స్ అందుకు పనికి రారు.. కరణ్ జోహార్ సంచలన కామెంట్స్..!!

మల్టీ టాలెంటెడ్ కరణ్ జోహార్ గురించి ఎంత చెప్పినా తక్కువే . నటుడిగా , డైరెక్టర్గా , ప్రొడ్యూసర్ గా , హోస్ట్ గా తనదైన స్టైల్ లో బాలీవుడ్ ఇండస్ట్రీని అల్లాడిస్తున్న కరణ్ జోహార్ ..ఎప్పటికప్పుడు కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో , సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటాడు. నెపోటీజం కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే కరణ్ జోహార్ .. ఎంతోమంది స్టార్ వారసులను ఇండస్ట్రీలోకి పరిచయం చేసి ఆ ఘనతను సాధించుకున్నాడు .

అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన స్టార్స్ అందరూ పెద్దపెద్ద పొజిషన్లో ఉండడం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. కాగా రీసెంట్ గా కరణ్ జోహార్ మరోసారి తన నోటికి పని చెప్పారు . తనదైన స్టైల్ లో బాలీవుడ్ స్టార్ హీరోలపై కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు . రీసెంట్గా ఆయన మాట్లాడుతూ..” సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోస్ మేమే తోపులమని భావిస్తూ ఉంటారు . బయటకు వెళ్ళినప్పుడు సెల్ఫీల కోసం .. ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడితే మనకు మించిన స్టార్స్ లేరని అనుకుంటారు . అదంతా వాళ్ళ భ్రమ… సెట్ లొకేషన్ లోకి వచ్చాక వాళ్ళ అసలు నటన టాలెంట్ ఏంటో బయటపడుతుంది”.

“స్టార్ హీరోలు ఆ భ్రమ నుంచి బయటకు రావాలి. ఫ్యాన్స్ క్రేజ్ కోసమే అలా ఫొటోస్ ఆటోగ్రాఫ్స్ అడుగుతూ ఉంటారు. మనల్ని మనం ప్రశ్నించుకుంటే మీ స్థాయి ఏంటో మీకు అర్థమైపోతుంది . ఈ కామెంట్స్ చేస్తే నన్ను చంపేస్తారేమో. కానీ ఇదే నిజం “అంటూ కొందరు బాలీవుడ్ స్టార్ హీరోస్ ని టార్గెట్ చేస్తూ కరణ్ జోహార్ చేసిన కామెంట్స్ ప్రజెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు ఓటీటిని దృష్టిలో పెట్టుకొని కొత్త యువతకు , కొత్త టాలెంట్ కి అవకాసాలు ఇవ్వాలి అంటూ కరణ్ చెప్పుకు రావడం ఇప్పుడు బాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news