ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్.. లక్ష్మి కళ్యాణం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న కాజల్ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకెళుతూ కంటెంట్ ఉన్న పాత్రలో గ్లామరస్ పాత్రలు చేస్తూ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో తనకంటూ చెరగని ముద్ర వేయించుకుంది .
ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో కుర్ర బ్యూటీ లు వస్తున్నా సరే కాజల్ అగర్వాల్ పేరు చెప్తే ఊగిపోయే జనాలు ఎంతోమంది ఉన్నారు. కెరియర్ పిక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతం ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ ఎంత త్వరగా పెళ్లి చేసుకుందో.. అంతే త్వరగా బిడ్డకు జన్మనిచ్చింది . బాబు కి జన్మనిచ్చిన తర్వాత కాజల్ తన పూర్తి టైం బిడ్డకే కేటాయించింది.
ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ పై కాన్సన్ట్రేషన్ చేస్తూ సినిమాలోకి వస్తున్న కాజల్ ..తన భర్త బేబీ కేరింగ్ విషయంలో శూన్యమని అసలు బేబీని ఎలా చూసుకోవాలో కూడా తన భర్తకు తెలియదంటూ ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొచ్చిందట . అంతేకాదు గౌతం కొన్ని కొన్ని విషయాల్లో చాలా నిర్లక్ష్యంగా ఉంటాడని ..ఎప్పుడు బిజినెస్.. బిజినెస్ అంటూ ఆ మైండ్ సెట్ లోనే ఉంటాడు . కానీ డిన్నర్ డేట్స్, రొమాంటిక్ టూర్స్ అస్సలు ప్లాన్ చేయడని.. కాజల్ అగర్వాల్ నే దగ్గరుండి అని చెప్పి మరి చేయించుకుంటుందని బాలీవుడ్ లో న్యూస్ వైరల్ అవుతుంది. ఈ కారణంగానే కాజల్ కు గౌతమ్ కు మధ్య తగాదాలు వస్తుంటాయని తెలుస్తుంది .