సినీ పరిశ్రమలో మెగా వర్సెస్ నందమూరి అన్నట్టుగానే వాతావరణం ఉంటుంది. మా హీరోలు గొప్ప అంటే.. మా హీరోలు గొప్ప.. అని అభిమానులు ఎప్పటికప్పుడు కయ్యానికి దిగుతూనే ఉంటారు. ఇది దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. అయితే అభిమానులు ఎంత కొట్టుకున్నా సరే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ స్నేహంగా కలిసి మెలిసి ఉంటారు. `ఆర్ఆర్ఆర్` మూవీతో వీరి బంధం మరింత బలపడింది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీ మేకింగ్ సమయంలో ఎన్టీఆర్, చరణ్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదిరిందని చాలా మంది భావించారు. కానీ, సినిమా ప్రారంభం కాకముందు నుంచే తాము మంచి స్నేహితలం అని గతంలోనే పేర్కొన్నారు.
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవికి సైతం ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమట. మెగా ఫ్యామిలీలో అంతమంది హీరోలు ఉన్నా సరే చిరుకు మాత్రం ఫేవరేట్ అనే వారు ఎవరు లేరట. సహజంగా ఉండే ఫ్యామిలీ అనుబంధాలను పక్కన పెట్టేస్తే బయట హీరోల్లో మరో హీరో చిరుకు బాగా ఇష్టం అట. ఆ హీరోని మాత్రం ప్రత్యేకంగా అభిమానిస్తారట. ఆ హీరో మరెవరో కాదు ఎన్టీఆరే.
ముఖ్యంగా డాన్స్ విషయంలో ఎన్టీఆర్ ను చిరంజీవి ఎక్కువగా అభిమానిస్తారట. అలాగే ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాను చిరంజీవి చూస్తారట. పైగా ఎన్టీఆర్ కు ఫోన్ చేసి అభినందిస్తారట. `ఆర్ఆర్ఆర్` విడుదల తర్వాత కూడా చిరంజీవి ఎన్టీఆర్ కు ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపించారన్నది తెలిసిందే. నటన మరియు డాన్స్ లో గ్రేస్ ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ ను మెచ్చుకున్నారట.