Movies"నేను అలా మాట్లాడడానికి కారణం అదే".. ఒక్క మాట తో అందరికి...

“నేను అలా మాట్లాడడానికి కారణం అదే”.. ఒక్క మాట తో అందరికి ఇచ్చిపడేసిన ఎన్టీఆర్..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ పైకి ఎదుగుతున్నాడు అంటే అతను కిందకి లాగడానికి నాలుగు చేతులు రెడీ గా ఉంటాయి. అది ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే.. జనాలు లేదా ఆయనని ఇష్టపడని వాళ్ళు.. అతగాడిని కిందకి లాగడానికి ట్రై చేస్తూనే ఉంటాయి. కాగా రీసెంట్గా అదే సిటువేషన్ ని ను ఫేస్ చేస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్ టీఆర్.

ఈ మధ్యకాలంలో తారక్ పై సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయో మనందరికీ తెలిసిందే .ఆయన నటించినా ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా ఆయనను దారుణంగా ట్రోల్ చేశారు ఓ వర్గం జనాలు. అంతేకాదు అంతకుముందు పొలిటికల్ ఇష్యూస్ లో కూడా ఆయన ప్రమయం ఏమీ లేకుండా కానీ ఆయనని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫంక్షన్ లో తారక్ ఇంగ్లీష్ యాసలో మాట్లాడడం పై నానా రాద్ధాంతాలు చేస్తున్నారు కొందరు జనాలు.

ఇదే క్రమంలో తారక్ అక్కడున్న మిగతా సభ్యులని కించపరచాలని చూసాడని .. ఆ క్రమంలోనే అందుకే అలా స్టైలిష్ ఇంగ్లీష్ మాట్లాడుతూ మన తెలుగుని అవమానించాడని కొందరు చెప్పుకొచ్చారు .దీంతో తారక్ ఇలాంటి కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. ” నేను ఎవరిని కించపరచడానికి ..తక్కువ చేయడానికి అలా ఇంగ్లీష్ యాశలో మాట్లాడలేదని.. ఎక్కడికి వెళ్లినా ఆ భాషను ఆ దేశపు సంప్రదాయాలను, భాషను గౌరవించడం మన పద్ధతి అని ..అందుకే నేను అక్కడ అలా ఇంగ్లీష్ లో మాట్లాడానని ..దీనిలో తప్పుడు అర్థం తీయొద్దు” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా నందమూరి ఫ్యాన్స్ ఆయన మాటలను ట్రెండ్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఎంత సైలెంట్ గా ఉన్నా ఓ వర్గం మాత్రం కావాలని ఆయన రెచ్చగొడుతుంది అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news