ఇండియన్ సినిమా హిస్టరీ నుంచి ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు రేసులో చివరి ఫైనల్ స్టేజ్‌కు దగ్గర వరకు వెళ్లిన సినిమా త్రిబుల్ ఆర్. ఈ సారి జరుగుతోన్న ఓటింగ్ చూస్తుంటే త్రిబుల్ ఖచ్చితంగా ఫైనల్స్‌కు వెళ్లేలా ఉంది. ఇప్పటికే నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఈ అవార్డును ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఆస్కార్‌కు త్రిబుల్ ఆర్ మూవీ అడుగు దూరంలోనే ఉందన్న మాట వినిపిస్తోంది.
ఓ ఇండియన్ సినిమా.. అది కూడా కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్ అయిన మన తెలుగు సినిమాకు ఇంత గొప్ప గౌరవం లభించడం నిజంగా మన తెలుగు వాడి గర్వకారణం అని చెప్పుకోవాలి. మరో విశేషం ఏంటంటే ఆస్కార్ ఓటింగ్ బరిలో ఇప్పటి వరకు గతంలో జరగని విధంగా ఓటింగ్ పడిందని అంటున్నారు. ఈ విషయం బయటకు కూడా వచ్చింది.
అయితే ఇదంతా కూడా త్రిబుల్ ఆర్ సినిమా మీద ఇండియన్ సినిమా జనాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు, విదేశాల్లో ఉన్న జనాభాకు కూడా ఉన్న క్రేజ్ వల్లే జరిగిందని అంటున్నారు. పలు విభాగాలలో త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ బరిలో పోటీపడుతోంది. ఇప్పటికే టాప్ లిస్టులోకి కూడా ఈ సినిమా చేరుకుంది. ఇదిలా ఉంటే ఆస్కార్ బరిలో బెస్ట్ యాక్టర్ కేటగిరిలో నలుగురు నటులను యూఎస్ఏ టుడే లైఫ్ అనే వెబ్‌సైట్ ప్రముఖంగా ప్రస్తావించింది.
ఈ సారి ఆస్కార్ బరిలో బ్రిలియెంట్ పెర్పామెన్స్‌తో టాప్ లో పోటీ పడుతోన్న వారిలో టాప్ క్రూజ్‌తో పాటు పలువురు హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. అయితే వీరితో పోటీ పడుతూ మన తారక్ కూడా నెంబర్ ఓటింగ్‌లో నిలబడడం చాలా గొప్ప విషయం. ఈ నేపథ్యంలోనే తారక్‌కు బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందని కూడా ఈ వెబ్‌సైట్ ఈ విషయాన్ని ప్రస్తావించింది.
త్రిబుల్ ఆర్‌లో ఎన్టీఆర్ స్క్రీనింగ్ బెస్ట్ యాక్టర్స్ కేటగిరిలో అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిగా పేర్కొంది. ఏదేమైనా తారక్‌కు ఆస్కార్ అవార్డు వస్తే ఇండియన్ సినిమా చరిత్రలోనూ.. ఇటు తెలుగు సినిమా చరిత్రలోనూ చాలా గొప్ప విషయంగా చరిత్రలో నిలిచిపోతుంది.