Movies"అన్న కండీషన్ క్రిటికల్ గానే ఉంది"...ఎన్టీఆర్ ఎమోషనల్..!!

“అన్న కండీషన్ క్రిటికల్ గానే ఉంది”…ఎన్టీఆర్ ఎమోషనల్..!!

మనకు తెలిసిందే .. నారా చంద్రబాబునాయుడు కొడుకు నారా లోకేష్ యువగళం పేరిట మొదలుపెట్టిన పాదయాత్ర సందర్భంగా నందమూరి మనవడు తారకరత్న కూడా పాదయాత్రలో పాల్గొన్నాడు . ఈ క్రమంలోనే అక్కడ జనాల తాకిడికి స్పృహతప్పి పడిపోయిన ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు. అంతేకాదు రీసెంట్ గా రిలీజ్ అయిన హెల్త్ బులిటిన్ ప్రకారం తారకరత్న హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది అంటూ డాక్టర్లు చెప్పుకొచ్చారు .

ఆయనకి మెలోడా అనే అరుదైన వ్యాధి సోకినట్లు డాక్టర్లు గుర్తించారు . ఈ క్రమంలోని నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ హుటాహుటిన బెంగళూరులోని నారాయణ హృదయా ఆసుపత్రికి వెళ్లారు . తారకరత్న ను చూసిన అనంతరం ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ మిడియాతో మాట్లాడారు. ” తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుందని .. ఆయన కూడా పోరాడుతున్నారని చెప్పారు. ఆయనకు అభిమానుల ఆశీర్వాదం, తాత ఆశీర్వాదం ఉందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. అందరూ ప్రార్థనలు కొనసాగించాలని, అభిమానుల ఆశీర్వాదం ఎంతో ముఖ్యమని చెప్పారు”.

ఎక్మో సాయంలో తారకరత్న లేరని తెలుస్తుంది. వారితో పాటు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కూడా ఆస్పత్రికి చేరుకుని తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఏది ఏమైన సరే మరో 24 గంటలు గడిస్తేనే కానీ అసలు విషయం ఏంటా అని చెప్పలేకపోతున్నారు డాక్టర్లు..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news