ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమయ్యే షోలు టి ఆర్ పి రేటింగ్స్ పెంచుకోవడానికి ఎలాంటి ఛండాలమైన పనులు చేయడానికి అయినా రెడీగా ఉన్నారు . మరీ ముఖ్యంగా జబర్దస్త్ లో టిఆర్పి ల కోసం ఎలాంటి పాడు పనులు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. వల్గర్ తో పాటు లేడీస్‌ని డిగ్రేడ్ చేసే కామెంట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాగా ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అలాంటివి ఎక్కువైపోయాయి . అంతేనా ఎపిసోడ్ కి సరికొత్త కంటెంట్ క్రియేట్ చేస్తూ .. వచ్చిన గెస్ట్ లను సర్ప్రైజ్ చేస్తూ హ్యూజ్ టీఆర్పిలను సంపాదించుకుంటుంది శ్రీదేవి డ్రామా కంపెనీ .
రీసెంట్గా జనవరి 29న ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు . ఈ క్రమంలోనే ప్రోమోలో కార్తీ ఖైదీ చిత్రంలో విలన్ గా నటించిన అర్జున్ దాస్ హైలెట్ అయ్యాడు . మనకు తెలిసింది బుట్ట బొమ్మ సినిమాతో మరోసారి జనాలను పలకరించడానికి వస్తున్నాడు అర్జున్ దాస్. ఈ సినిమాలో హీరోయిన్గా అనికా సురేంద్రన్ నటిస్తుంది . విశ్వాసం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసిన ఆ చిన్న పాపే ఈ సినిమాలో పెద్ద పాపగా హీరోయిన్గా చేస్తుంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకి వచ్చిన అర్జున్ దాస్ ను ఓ ఆట ఆడేసుకున్నారు అక్కడుండే అమ్మాయిలు.
మరీ ముఖ్యంగా అక్కడ ఉన్న లేడీ కమెడియన్ రోహిణి తో అర్జున్ దాస్ చేసిన కామెడీ విపరీతంగా హైలెట్ అయింది . అంతేకాదు ఏకంగా ఆమెను ఎత్తుకొని కుర్చి చుట్టూ తిరగడం ప్రోమో కే కొత్త బూస్టప్ ఇచ్చింది. టాస్క్ లో భాగంగా అర్జున్ ఇలా చేశాడు. కాగా మధ్యలోకి ఎంటర్ అయిన రష్మీ..” బరువు మోస్తున్నాడు ..బాధ్యతలు మోయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకెందుకు ఆలస్యం” అంటూ చెప్పగానే రోహిణి సిగ్గుపడుతూ తాను అతగాడితో ప్రేమలో ఉన్న ఫీలింగ్ ని బయటపెట్టింది.. ఈ క్రమంలోని అర్జున్ దాసు కూడా ఆమె ప్రేమని అంగీకరించినట్టు చూసి వెంటనే దండం పెట్టేసాడు . ఈ సీన్ బాగా నవ్వులు పూయించింది. దీంతో కొందరు జనాలు రోహిణి నిజంగానే అతగాడితో లవ్ లో పడిందా అంటూ షాక్ అయిపోతున్నారు.
అయితే ఇలా షో టీఆర్పీ కోసం అందరితో లవ్ లో పడితే దాన్ని ప్రేమ అనరని.. మరో రకమైన ఫీలింగ్ అంటారని జనాలు ఏకిపారేస్తున్నారు . ఏది ఏమైనా కానీ రోహిణి చేసింది కామెడీ కోసం జనాలు దాన్ని లైట్‌గా తీసుకోకుండా మరో కోణంగా ఆలోచించి ఆమె ట్రోల్ చేయడం న్యాయం కాదు అంటూ రోహిణి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!