మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టేసింది. తొలిరోజు సినిమాకు వచ్చిన టాక్ తో ఫ్యాన్స్ మరీ అంత జోష్‌లో లేరు. అయితే రెండో రోజు నుంచే సినిమా బాగా ఫికప్ అయిపోయింది. ఇప్పుడు వీరయ్య బ్రేక్ ఈవెన్ దాటేసి బ్లాక్‌బస్టర్ కొట్టేసింది. సినిమా కొన్న వారందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఓవరాల్‌గా ఈ సినిమా గ్రాస్ వసూళ్లు రు. 200 కోట్లు క్రాస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
మూడు వరుస ప్లాపుల తర్వాత చిరంజీవికి పెద్ద సూపర్ హిట్ రావడంతో చిరు, మెగాభిమానులు మామూలు ఉత్సాహంతో లేరనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు దర్శకుడు బాబి. బాబి చిన్నప్పటి నుంచే చిరుకు వీరాభిమాని. అయితే ఈ సినిమా దర్శకుడు బాబి అయినా కూడా… ఈ సినిమా విజయం వెనక దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నాడట. ఈ విషయాన్ని బాబీయే స్వయంగా చెప్పారు.
అసలు విషయం ఏంటంటే కొరటాల చిరుతో ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తీశాడు. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగా… కరోనా లాక్‌డౌన్ టైంలో వీరయ్య కథలో మరో బలమైన పాత్ర కోసం ఆలోచన చేస్తున్నాడట. అప్పుడు రవితేజ బాబి మైండ్‌లోకి వచ్చాడట. బాబి ఫస్ట్ సినిమా పవర్‌లో హీరో రవితేజనే. అయితే ఇదే విషయాన్ని బాబి.. కొరటాలతో పంచుకోవడంతో ఈ పాత్రను మరింత బలంగా రాయమని చెప్పాడట.
అదే ఉత్సాహంతో బాబి రవితేజను దృష్టిలో పెట్టుకుని చాలా బలంగా ఆ పాత్రను మలిచాడట. అలా ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు కొడుకులు కాకుండా… వేర్వేరు తల్లులకు పుట్టిన ఇద్దరు హీరోలను తెరమీద ఒకేసారి చూపిస్తే ఎలా ? ఉంటుందన్న కోణంలో కథ మలుచుకున్నాడు. అయితే ఈ ఆలోచనను ముందు చిరంజీవితో కాకుండా కొరటాలతో పంచుకోవడం.. ఆయన సూచన మేరకే రవితేజను మైండ్‌లో పెట్టుకుని పూర్తిస్థాయి కథను డవలప్ చేసుకోవడం జరిగాయి.
అలా కొరటాల ఇచ్చిన సలహాతో రవితేజ లాంటి బలమైన పాత్ర క్రియేట్ అయ్యిందని.. ఈ కథ పూర్తిగా రెడీ చేసుకున్నాక చిరుకు చెపితే సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారంటూ బాబి హ్యాపీగా చెప్పారు. బ్యాడ్‌లక్ ఏంటంటే కొరటాల డైరెక్ట్ చేసిన ఆచార్య సినిమా ప్లాప్ అయితే.. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో బాబి అదే చిరుతో వాల్తేరు వీరయ్య చేసి బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు.