నటసింహం నందమూరి బాలకృష్ణకి అభిమానులు ఏ రేంజ్‌లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడ కనిపించినా “జై బాలయ్య” అనే అరుపులు, కేకలు వినిపిస్తాయి. కామన్ ఆడియన్స్ కూడా బాలయ్య అంటే ఊగిపోతారు. ఇంతకాలం ఆయన సినిమాలలో హీరోగా విభిన్నమైన పాత్రలను పోషించి అలరించారు. ఫ్యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ ఈ నందమూరి నటసింహం.
అలాంటి బాలయ్య ఫ్యామిలీ ఆడియన్స్‌ను తన ఫ్యాక్షన్ సినిమా కోసం థియేటర్స్‌కి పరిగెత్తుకొచ్చేలా చేస్తారంటే ఆయన ఎంచుకునే కథ, కథనాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అర్థం అవుతుంది. బాలయ్య చెప్పే డైలాగులకి థియేటర్స్‌లో బాక్సులు బద్దలవ్వాల్సిందే. తొడ చరిస్తే విలన్ చడ్డి ఊడిపోవాల్సిందే. అది బాలయ్య స్టామినా.
బాలయ్య డైలాగులే కాదు..ఫైట్స్, డాన్స్ కూడా అదరగొడతారు. ఇటీవల అన్‌స్టాపబుల్ షో సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ మీద కూడా బాలయ్యదే హవా. ఆయన అడుగుపెడితే ఏదైనా దద్దరిల్లిపోవాల్సిందే. ఇది రాదు..అది చేయరు అనేది బాలయ్య డైరీలోనే లేదు. అందుకే, ఎన్‌బికె అన్‌స్టాపబుల్. ఇక బాలయ్య కెరీర్‌లో మొదటిసారి పాట పాడు ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించారు.
అది కూడా పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో సినిమా. బాలయ్య పాడుతుంది మొదటిసారి. ఎన్ని టేకులు తీసుకుంటారో ఏమో..మధ్యాహ్నం భోజనం ఏం తెప్పించాలో..లంచ్ తర్వాత కాసేపు రిలాక్స్ అవుతారేమో..క్యారవ్యాన్ కావాలి..అంటూ అన్నీ అరేంజ్‌మెంట్స్ చేసింది చిత్రబృందం.
కానీ, ఇక్కడ ఉంది నటసింహం. బరిలో దిగనంత వరేఅ అన్నీ ఆలోచించాల్సింది. ఒక్కసారి దిగాక పని పూర్తి చేయకుండా రెప్పకూడా వేయరు. అలాగే పైసా వసూల్ సినిమాలోని మావా ఏక్ పెగ్ లా పాటను కేవలం గంట అంటే ఒక్క గంటలోనే పాడి అందరికీ షాకిచ్చారు. బహుషా ఇది ఎవరూ ఊహించి ఉండరేమో.