వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా పరిచయం అయిన సినిమా దేవదాసు. 2005లో వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఏకంగా సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టేసింది. చాలా చోట్ల రజతోత్సవం కూడా జరుపుకుంది. ఈ సినిమాతో రామ్ క్రేజ్‌తో పాటు హీరోయిన్ ఇలియానా క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దేవదాసులు సన్న నడుము అందాలతో ఇలియానా కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసిపడేసింది.
ఆ వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమాలో నటించింది. అసలు పోకిరి సూపర్ బ్లాక్‌బస్టర్ కావడంతో ఇలియానా దూకుడుకు టాలీవుడ్లో పట్టపగ్గాలే లేవు. వరుసగా జూనియర్ ఎన్టీఆర్‌తో రాఖీ, శక్తి, బన్నీతో జులాయి, పవన్ కళ్యాణ్‌తో జల్సా, రవితేజతో అయితే కిక్, ఖతర్నాక్, అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరిని వాయించేసింది.
అసలు అప్పట్లో స్టార్ హీరోలు సైతం ఇలియానాతో సినిమా చేయకపోతే లైఫే వేస్ట్ అన్న ఫీలింగ్‌కు వచ్చేశారు. ఇక్కడ రు. కోటి రెమ్యునరేషన్ రేంజ్లో ఉన్న ఇలియానా వేసిన ఒకే ఒక్క రాంగ్ స్టెప్‌తో ఆమెను టాలవుడ్ దర్శక నిర్మాతలు ఒక్క తొక్కు తొక్కి వదిలిపెట్టారు. దీంతో ఆమె తిరిగి టాలీవుడ్లో ఛాన్సుల కోసం తాపత్రయ పడాల్సిన పరిస్థితికి దిగజారిపోయింది.
ఇక్కడ టాప్ హీరోల సినిమాల్లో ఛాన్సులు.. కోటికి పైగా రెమ్యునరేషన్ ఇస్తుంటే… బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోవాలని ఆమె ముంబైకు మకాం మార్చేసింది. ఆమెను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ను చేస్తే.. ఆమె బాలీవుడ్ ఛాన్సుల కోసం వెంపర్లాడింది. ముంబైలో ఉండి ఛాన్సుల కోసం అందరిచుట్టూ తిరిగింది. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమలో పడి సహజీవనం చేసింది. బాలీవుడ్ జనాలు ఆమెను పట్టించుకోలేదు.. ఒకటి రెండు ఛాన్సులు వచ్చినా అవి ప్లాప్ కావడం… ఇటు సహజీవనంతో ఆమె ఫిజిక్ అందా దెబ్బతినేసి లావెక్కిపోవడంతో ఆమెను అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు.
ఇటు ప్రియుడితో ప్రేమాయణం విఫలమైంది. ఇక శృంగారం అంటే తనకు ఎంతో ఇష్టం అని.. అది లేకపోతే తాను ఉండలేనంటూ బోల్డ్ కామెంట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యేందుకు ట్రై చేసింది. తర్వాత ఒక్క ఛాన్స్ అంటూ టాలీవుడ్ చుట్టూ తిరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అసలు ఆమె ఫోన్ చేసినా ఎవ్వరూ ఎత్తేవారే కాదట. శ్రీను వైట్ల చివరకు అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో తీసుకుంటే ఆ సినిమా డిజాస్టర్. దీంతో ఇలియానా అడ్రస్ లేకుండా పోయింది.