Moviesఅయ్య బాబోయ్..వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే..ఖంగుతినాల్సిందే..!!

అయ్య బాబోయ్..వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే..ఖంగుతినాల్సిందే..!!

ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అందగాడు రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడు . పెళ్లికి ముందే కేఎల్ రాహుల్ అతియా తో డేటింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే . తాజాగా వీరిద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు . బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి ఫామ్ హౌస్ లో అతి తక్కువ మంది సన్నిహితులు సమక్షంలో వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది .

ప్రస్తుతం ఈ జంట హనీ మూన్ ని ఎంజాయ్ చేస్తున్నారు . కాగా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ పేరు సంపాదించుకున్న అతియా పెళ్లికి వేసుకున్న లెహంగా మేటర్ ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయిందో తెలిసిందే. కాగా రీసెంట్గా వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అతియా శెట్టి వయసు ప్రస్తుతం 30 నవంబర్ 5 1992న జన్మించింది .

రాహుల్ 18 ఏప్రిల్ 1992లో జన్మించాడు అంటే వీళ్లిద్దరి మధ్య వయస్సు తేడా కేవలం 7 నెలల మాత్రమే. అంటే రాహుల్ -అతియా కన్నా ఏడు నెలలు పెద్దవాడు అంతే . ఈ క్రమంలోనే ఇంత తక్కువ వయసుతో రాహుల్ పెళ్లి చేసుకున్నాడా..? అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు వీళ్ళ పెళ్లికి అందరికన్నా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు కోహ్లీ ఏకంగా మూడు కోట్ల విలువచేసే కార్ ని గిఫ్ట్ చేస్తూ కేఎల్ రాహుల్ అంటే తనకి ఎంత ఇంపార్టెంటో చెప్పకనే చెప్పేసాడు విరాట్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news