కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటిన ఇప్పటికీ హీరోయిన్గా ఇండస్ట్రీలు అవకాశాలు అందుకుంటూ.. నేటితరం హీరోయిన్స్ కి ..కుర్ర బ్యూటీలకి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది . అంత ఎందుకు ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష పోనియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ తన కెరీర్ ను మొదలుపెట్టింది . ఈ క్రమంలోనే త్రిష మంచి మంచి ఆఫర్స్ అందుకుంటూ సోషల్ మీడియాలో హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుంటుంది.
అయితే ఆమె రీసెంట్ గా నటించిన కోలీవుడ్ సినిమా “రాంగి” ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టంగ్ స్లిప్ అయింది. ఆమె ని హోస్ట్ ప్రశ్నిస్తూ..” మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి ..”అంటూ అడగ్గా … త్రిష సమాధానం ఇస్తూ..” సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం అంటూనే.. బ్రాహ్మణుల ఇంటి భోజనాన్ని బాగా ఇష్టపడతాను” అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే త్రిష మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.
అడిగిన ప్రశ్నకి సూటిగా ఆన్సర్ ఇస్తే సరిపోతుంది ..మధ్యలో బ్రాహ్మణ కులం పేరు తీసుకురావడం అవసరం లేదు కదా మేడమ్ అంటూ కొందరు ఆమెని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు స్టార్ హీరోయిన్ త్రిష కి కక్యాస్ట్ పిచ్చి ఉందని.. ఆ కారణంగానే ఇలా అడగకపోయినా తన మనసులోని మాటను బయటపెట్టి ..ఈ విధంగా అడ్డంగా బుక్ అయింది అంటూ కోలీవుడ్ జనాలు ఆమెపై ఫైర్ అవుతున్నారు . దీంతో ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ స్టేటస్ అందుకుంటున్న త్రిష పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!