ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నందమూరి ఫ్యాన్స్ మధ్య వార్ ఏ రేంజ్ లో జరుగుతుందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ నందమూరి బాలయ్య వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఫన్నీగా అక్కినేని తొక్కినేని అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. ఇదే మాటలని టార్గెట్ చేసిన కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ బాలయ్యను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు .
అక్కినేని మనవళ్ళు బాలయ్య మాటలను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు . “ఎన్టీఆర్ , ఏఎన్నార్ , ఎస్వీఆర్ అందరూ కళామతల్లి బిడ్డలే అని .. అలాంటి వాళ్ళని తప్పుగా మాట్లాడిన కించపరిచి మాట్లాడిన మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లే అంటూ ఫైర్ అయ్యారు “. ఇదే క్రమంలో అక్కినేని ఫ్యాన్స్ కూడా నందమూరి బాలయ్య పై ఓ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు .
అయితే అక్కినేని ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నా కానీ అక్కినేని నాగార్జున దీనిపై ఏవిధంగా స్పందించలేదు . దీంతో అక్కినేని నాగార్జున పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అక్కినేని అంటే మనవళ్లకే వస్తుందా ..? నువ్వు ఆయన కొడుకువి కాదా..? నువ్వు కూడా అక్కినేని వారసుడివే గా..? మరి ఇంత సైలెంట్ గా ఎందుకు ఉన్నావ్ అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు మరికొందరు జనాలు మరీ రెచ్చిపోయి వెర్రి పుష్పం లా మూసుకోని ఉంటాడే..? అంటూ నాగార్జునను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!