బాలయ్య వీరసింహారెడ్డి థియేటర్లలోకి వచ్చేందుకు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ సారి సంక్రాంతికి వస్తోన్న ఐదు సినిమాల్లో అజిత్ తెగింపు తర్వాత బాలయ్య సినిమాయే రేసులో ఉంది. ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న వీరసింహాకు యూ / ఏ సర్టిఫికెట్ వచ్చింది. బాలయ్య చివరి సినిమా అఖండ అంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయినా కూడా రిలీజ్‌కు ముందు వీరసింహాకు వచ్చినంత బజ్ అయితే అఖండకు లేదు.
వీరసింహా నుంచి ఒక్కో స్టిల్, ఒక్కో సాంగ్, టీజర్, ట్రైలర్ వదులుతున్న కొద్ది బజ్ అయితే బాగా పెరుగుతూ వచ్చింది. ట్రైలర్‌తో అంచనాలు ఆకాశంలోకి వెళితే.. మాస్ మొగుడు సాంగ్‌తో అవి ఆకాశాన్ని దాటేసినట్టే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కవ చూసినా బాలయ్య నామస్మరణ మార్మోగుతోంది. దీనికి తోడు వీరసింహా కంటే ఒక రోజు ముందు రావాల్సిన విజయ్ వారసుడు ఇప్పుడు 14కు వెళ్లిపోయింది.
ఇది ఖచ్చితంగా వీరసింహాకు పెద్ద ప్లస్. అజిత్ తెగింపు 11న ఎక్కువ థియేటర్లలో వస్తోంది. ఆ రోజుతోనే ఆ సినిమా బడాయి అయిపోతుంది. ఇక 12న 90 శాతంకు పైగా థియేటర్లలో బాలయ్య సినిమాయే పడుతుంది. ఇప్పటికే ఆంధ్రా, నైజాం అంతటా బాలయ్య నామస్మరణతో ఊగిపోతున్నారు. దీంతో వీరసింహాకు అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా బాగుండడంతో భారీ ఓపెనింగ్స్ అయితే పక్కా.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం వీరసింహారెడ్డికి మొదటి రోజు రు. 25 – 30 కోట్ల షేర్ వస్తుందంటున్నారు. అయితే ఏపీ, తెలంగాణలో ఫస్ట్ డే దాదాపు అన్ని స్క్రీన్లు దొరకడంతో ఈ ఫిగర్ మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా అంటున్నారు. ఇక మంచి టాక్ వస్తే బాలయ్య క్రియేట్ చేసే సరికొత్త రికార్డులకు అంతే ఉండదు.