Moviesశ్రీదేవికి రాజమౌళితో రెమ్యూనరేషన్ గొడవకు మించిన ఇష్యూ ఉందా... జక్కన్న ఈగో...

శ్రీదేవికి రాజమౌళితో రెమ్యూనరేషన్ గొడవకు మించిన ఇష్యూ ఉందా… జక్కన్న ఈగో అక్కడే హర్ట్ అయిందా..!

అతిలోక సుందరి శ్రీదేవి రెండున్నర దశాబ్దాల పాటు భారతీయ సినిమా చరిత్రలో తిరుగులేని హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. శ్రీదేవి అంటే అప్పట్లో యువకుల కలల ఆరాధ్య దేవత. కేవలం శ్రీదేవి కోసమే సినిమాలు చూసేందుకు వేలం వెర్రిగా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే వారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన అందచందాలతో ప్రేక్షకులను మాయ చేసి పడేసింది.

ఈ క్రమంలోనే మిథున్ చక్రవర్తితో ప్రేమాయణం నడిపి.. ఆ తర్వాత బోనీకపూర్‌ను పెళ్లాడి ఇద్దరు పిల్లలకు త‌ల్లి అయ్యింది. 55 సంవత్సరాల వయసులో దుబాయిలో శ్రీదేవి అనుమానాస్పద‌ స్థితిలో మృతి చెందింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామి దేవి పాత్రకు ముందుగా శ్రీదేవినే అనుకున్నారు. ఆమెకు కథ చెప్పిన రాజమౌళి సినిమాలో నటించేందుకు ఒప్పించాడు కూడా..! అయితే అనూహ్యంగా ఆ ప్లేస్ లోకి రమ్యకృష్ణ వచ్చింది.

ఈ విషయం బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయ్యి రమ్యకృష్ణ చేసిన శివగామి దేవి పాత్రకు మంచి పేరు వచ్చిన తర్వాత కానీ రాజమౌళి బయట పెట్టలేదు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ మా అదృష్టం కొద్ది ఆ పాత్రకు శ్రీదేవి గారు ఒప్పుకోలేదని కాస్త సెటైర్‌గా మాట్లాడారు. ఈ సినిమాలో నటించేందుకు శ్రీదేవి ఏకంగా ఏడు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయ‌డంతో పాటు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చార్టెడ్ ఫ్లైట్ టికెట్లు, తనతో పాటు త‌న‌ అసిస్టెంట్ల కోసం ఫైవ్ స్టార్ హోటల్లో ఒక ఫ్లోర్ అంతా బుక్ చేయాలని ఇలా రకరకాల కండిషన్లు పెట్టారని.. తమకు బడ్జెట్ పరంగా వర్కౌట్ కాదని ఆమెను తప్పించి ఆ ప్లేస్లో రమ్యకృష్ణ తీసుకున్నట్టు చెప్పారు.

రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలపై తర్వాత శ్రీదేవి కూడా కౌంటర్ ఇచ్చారు. రాజ‌మౌళి బాహుబలి సినిమా చాలా బాగా చేశారని… ఆయన డైరెక్ట్ చేసిన‌ ఈగ సినిమా తనకు ఎంతో నచ్చిందని.. తెలుగు సినిమా ఖ్యాతి పెంచిన అలాంటి వ్యక్తి తాను అని మాటలను అన్నట్టు చెప్పటం బాధపెట్టేలా చేసిందని చెప్పారు. అయితే రాజమౌళి – శ్రీదేవి మధ్య రెమ్యూనరేషన్ కన్నా శ్రీదేవి పెట్టిన కండిషన్లే రాజమౌళిని బాగా హర్ట్ చేశాయట‌.

అందుకే రాజమౌళి ఆమెను బాహుబలి సినిమాలోకి తీసుకోలేదని టాక్. రాజమౌళి సినిమా మార్కెట్‌కు శ్రీదేవికి ఇచ్చే రెమ్యూనరేషన్ పెద్ద కష్టం కాదు. అయితే రెమ్యూనరేషన్ కంటే కూడా శ్రీదేవి పెట్టిన ఇతర కండిషన్లు నచ్చకపోవడంతోనే రాజమౌళి శ్రీదేవిని పక్కనపెట్టి ఆ ప్లేస్లో రమ్యకృష్ణను తీసుకున్నారని టాలీవుడ్ వర్గాల్లో తర్వాత ప్రచారం బాగా జరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news