రాంగోపాల్ వర్మ..ఏది చేసినా సంచలనం అవ్వాలనే చెస్తాడని కొందరంటుంటారు. కానీ, కొందరు మాత్రం ఆయన ఏదన్న చేసిన తర్వాతే సంచనలం అవుతుందని వాదిస్తుంటారు. అది ట్వీట్ అయినా..సోషల్ మీడియాలో రిలీజ్ చేసే వీడియో అయినా. మొదటి సినిమా శివ నుంచే ఆర్జీవీ ప్రతీసారి హాట్ టాపిక్ అవుతూ వస్తున్నారు. వాస్తవ సంఘటనలను సినిమా చేయడంలో ఆర్జీవీ సిద్ధహస్తుడు.
అమ్మాయిలను ఆరాధించడంలో అంతకంటే గొప్పవాడు. ప్రకృతిలో అమ్మాయికి ఆర్జీవీ ఇచ్చేస్తానం మొదటిది. తనకి నచ్చినట్టు జీవించడానికి భార్యకి విడాకులు కూడా ఇచ్చాడంటే ఎంత ఫ్రీడం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఫ్యామిలీ మేన్ అయితే, జీఎస్టీ..డేంజర్ లాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు రావు. రక్త చరిత్ర సిరీస్ చేస్తే ఆదరించిన అభిమానులు జీఎస్టీ తీస్తే మాత్రం విమర్శించారు.
కానీ, ఇవన్నీ ఆర్జీవీ చిటికెలో మర్చిపోతారు. అంతవరకూ ఎందుకు ఆయన సినిమా తీసి రిలీజ్ చేసిన నెక్స్ట్ మినిట్ దాని గురించి ఆలోచించడం మానేసి కొత్త సినిమా గురించి ఆలోచనలు మొదలుపెడతరారు. అయితే, ఇటీవల కాలంలో రాంగోపాల్ వర్మ మరీ కుర్ర భామలతో రొమాన్స్ చేస్తున్నారు. అప్సర రాణి, అషురెడ్డి ఆర్జీవికి కూతురు ఏజ్ ఉన్నవాళ్ళు.
కానీ, వారితో రొమాంటిక్గా గడిపితే ఆ ఎనర్జీ లెవల్స్ వేరే లెవల్. శాస్త్రాలు, డాక్టర్లు చెప్పేదేంటంటే వయసులో తమకంటే చిన్నవాళ్ళతో రొమాన్స్ చేస్తే సామర్థ్యం బాగా పెరుగుతుంది. అదే మన సంచలన దర్శకుడు ఫాలో అవుతున్నారనిపిస్తోంది. మరి ఆర్జీవీలో నిజంగా అంతటి రసికతనం ఉందా లేదా ఆయనకే తెలియాలి.