శ్రీదేవి అంటే 40 ఏళ్ల క్రితం సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు ఓ ఆరాధ్య దేవత.. ఆమె ఓ సంచలనం.. ఆమెను చూసేందుకే 18 ఏళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల ముసలాడి వరకు థియేటర్లకు క్యూ కట్టేవారు. 1990వ దశకంలో బాలీవుడ్‌లోనే ఎక్కువ రెమ్యునరేషన్ పొందిన హీరోయిన్లలో ఆమె ముందు ఉండేవారు. సౌత్ నుంచి నార్త్‌కు వెళ్లిన శ్రీదేవి బాలీవుడ్ హీరోయిన్లనే తలదన్నే రేంజ్‌లో అభిమానులను సంపాదించుకుని.. అదే రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేసే హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు.
శ్రీదేవి తమిళ అమ్మాయి అయినా కూడా ఆమె తెలుగు మూలాలు ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. తమిళనాడులోని శివకాశిలో బ్రాహ్మణ వర్గంలోని అయ్యంగార్ల కుటుంబంలో ఆమె పుట్టారు. తిరుపతిలో ఆమె బంధువులు ఎంతోమంది ఉన్నారు. 1963 ఆగస్టు 13న తమిళనాడు రాష్ట్రంలోని శివకాశీలోని మీనంపాడులో శ్రీదేవి జన్మించింది. ఆమె అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగేర్ అయ్యప్పన్.
ఎన్నో సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమెను భారత ప్రభుత్వం 2013లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అప్పటి భారత రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ నుంచి ఆమె ఈ అవార్డు అందుకుంది. శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది అన్న విషయం అందరికి తెలుసు. అయితే అంతకంటే ముందే ఆమె బాలీవుడ్‌లో అప్పట్లో పాపులర్ నటుడుగా ఉన్న మిథున్ చక్రవర్తితోనూ ప్రేమాయణం నడిపింది.
అప్పట్లో శ్రీదేవి – మిథున్ కాంబినేషన్‌కు తిరుగులేని క్రేజ్ ఉండేది. ఈ క్రమంలోనే శ్రీదేవి, మిథున్ 1985లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని మూడేళ్ల పాటు కాపురం చేశారు. అయితే అప్పటికే మిథున్‌కు యోగితా బాలీతో పెళ్లయ్యింది. ఆమెను వదులుకునేందుకు మిథున్ ఇష్టపడలేదు. శ్రీదేవిని రెండో భార్యగా ఉంచుకునేందుకు మాత్రమే ఓకే చెప్పాడు. ఇది శ్రీదేవి తల్లికి ఇష్టం లేదు.
దీంతో 1988లో మిథున్‌కు శ్రీదేవి విడాకులు ఇచ్చేసిందనే అంటారు. దీనిపై అప్పట్లో పాపులర్ సినీ పత్రిక అయిన ఫ్యాన్ మ్యాగజైన్ వారి వివాహ పత్రం ఫొటోను వేయడంతో అది సంచలనం అయ్యింది. ఆ తర్వాత చాలా యేళ్ల పాటు ఖాళీగానే ఉన్న ఆమె 2 జూన్, 1996లో ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లాడింది. బోనీకి కూడా ఇది రెండో పెళ్లే. వీరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. చివరకు దుబాయ్‌లో తన మేనళ్లుడు వివాహానికి వెళ్లిన శ్రీదేవి అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.