నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే . నారా లోకేష్ యువగళం పేరిట చేపట్టిన పాదయాత్రలో భాగంగా తారకరత్న కూడా పాల్గొన్నారు . ఇదే క్రమంలో జనాల తాకిడికి ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయిన తారకరత్నను .. హుటాహుటిన దగ్గరలోని సమీప ఆసుపత్రికి తరలించారు టిడిపి కార్యకర్తలు . కాగా ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించడంతో కుప్పం నుంచి నేరుగా బెంగళూరు కి తరలించిన తారకరత్నను .. డాక్టర్స్ ప్రత్యేక పర్యవేక్షణలో పెట్టి అబ్జర్వ్ చేస్తున్నారు .
కాగా ఇదే క్రమంలో క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడిన తారకరత్న ..ప్రజెంట్ సేఫ్ జోన్ లోకి వచ్చిన్నట్లే అని చెప్పుకొస్తున్నారు. మరో 48 గంటలు గడిస్తే తారకరత్న ఆరోగ్యం పై పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న ఫ్యామిలీకి అండగా నిలుస్తుంది నందమూరి కుటుంబం. కాగా నిన్ననే ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకొని తారకరత్నను పరామర్శించారు.
కాక ఇదే క్రమంలో తారకరత్న ఫ్యామిలీకి ఓ వ్యక్తి అండగా నిలుస్తున్నాడు . ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, కాగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న ఆయన మరెవరో కాదు . టీడీపీ ఇన్ఛార్జ్, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు చల్లా రామచంద్రారెడ్డి కూడా ఉండటం గమనార్హం. చల్లాకు తారకరత్నతో పార్టీపరమైన సంబంధమే కాదు బంధుత్వం కూడా ఉంది. తారకరత్న వివాహం చేసుకున్న అలేఖ్యా రెడ్డి మరెవరో కాదు చల్లా రామచంద్రారెడ్డి పెద్దమ్మ కుమార్తెనే కావడం గమనార్హం.
దీంతో.. తారకరత్నకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసి చల్లా కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. భర్తకు గుండెపోటు రావడం, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుమిలిపోతున్న తారక రత్న భార్య అలేఖ్యారెడ్డిని ఓదార్చుతూ, ధైర్యం చెబుతూ చల్లా భార్య సుప్రియారెడ్డి కూడా బెంగళూరులోని ఆసుపత్రిలోనే ఉన్నారు.