ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఒక్కటే పాట హైలెట్ గా ట్రెండ్ అవుతుంది. అదే వాల్తేరు వీరయ్య లోని బాస్ పార్టీ సాంగ్ . ఈ సాంగ్ ఇండస్ట్రీని ఓ ఉప్పు ఊపేస్తుందో అందరికీ తెలిసిందే . టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య. అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ , కెధరిన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా స్పెషల్ రోల్ లో నటించి మెప్పించాడు .
ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రికార్డ్ నెల్కొల్పింది. ఈ సినిమాలో ఎన్నో పాటలు ఉన్నా అన్నిటికన్నా హైలెట్గా నిలిచింది బాస్ పార్టీ సాంగ్. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఊర్వశి రౌటేలా..వేసిన స్టెప్పులు ఈ పాటకే హైలెట్ గా నిలిచింది. కాగా ప్రజెంట్ బాస్ పార్టీ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
నిజానికి బాబీ ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా అనుకున్నింది.. బాలీవుడ్ ముద్దుగుమ్మ నూర ఫతేహి నట. ఈ పాట కోసం ఆమె నే ఫైనల్ చేసుకున్నారట . మెగాస్టార్ చిరంజీవి మాత్రం నూర ఫతేహి ని వద్దు అని చెప్పి..ఊర్వశీ రౌటేలా పేరును సజిస్ట్ చేశారట. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే ఈ ఒక్క పాట కోసం ఆమెకి ఏకంగా రెండు కోట్లు ఇవ్వడం నిజంగా షాకింగ్ గా ఉంది అంటున్నారు జనాలు..!!