మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులాటి సంపాదించుకున్న సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది . హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని అనివార్య కారణాల చేత అతగాడికి విడాకులు ఇచ్చేసింది . దీంతో ప్రజెంట్ సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న సమంత .. రీసెంట్ గానే మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైనట్లు .. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
అంతేకాదు ఆమె లేటెస్ట్ శాకుంతలం చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా సమంత ఫిజిక్ ని బట్టి ఆమె కండిషన్ బాగోలేదు అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . ఈ క్రమంలోని సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ఖుషి సినిమా వాయిదా పడుతూ వచ్చింది . గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఖుషి సినిమా నుండి సమంత తప్పుకుంది అని ఆ ప్లేస్ లోకి రష్మిక మందన యాడ్ అయింది అంటూ వార్తలు వినిపించాయి.
ఈ క్రమంలోనే ఈ వార్త ఆ నోట ఈ నోట పడి డైరెక్ట్ గా డైరెక్టర్ శివ నిర్వాణ వద్దకు చేరింది . దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన శివనిర్వాణ “ఖుషి సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది” అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. దీంతో సమంత ఖుషి సినిమా నుండి తప్పుకుంది అంటూ వస్తున్న వార్తలు మొత్తం ఫేక్ అంటూ చెప్పకనే చెప్పేశాడు డైరెక్టర్ . ఈ క్రమంలోనే డైరెక్టర్ చేసిన ట్విట్ వైరల్ అవుతుంది..!!