కొల్లు రవీంద్ర బ్రాకెట్లో బాబి.. ఇప్పుడు టాలీవుడ్లో బాగా మార్మోగుతోన్న యంగ్ డైరెక్టర్. రైటర్ నుంచి డైరెక్టర్‌గా మారిన బాబి.. తక్కువ టైంలోనే స్టార్ హీరోలను డైరెక్ట్ చేయడంతో పాటు మంచి విజయాలు అందుకున్నాడు. రవితేజతో పవర్, పవన్ కళ్యాణ్‌తో సర్దార్ గబ్బర్‌సింగ్, ఎన్టీఆర్‌తో జై లవకుశ, వెంకీ, నాగచైతన్యతో వెంకీమామ ఇలా ట్రాక్ రికార్డు చూస్తుంటే అన్నీ స్టార్ హీరోల కాంబినేషన్లే.. ఇక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో పోటీ పడుతూ రిలీజ్ అవుతోంది. రీసెంట్గా బాబి తండ్రి కూడా మృతిచెందగా.. చిరంజీవి కూడా బాబిని పరామర్శించారు. ఇక బాబి స్వస్థలం గుంటూరు. చిన్నప్పటి నుంచే మెగాస్టార్ అభిమాని అయిన బాబి పెద్దయ్యాక డైరెక్టర్ అవ్వాలన్న కోరికతో హైదరాబాద్ వచ్చేశారు.
ముందుగా పోసాని కృష్ణమురళీ, ఆ తర్వాత కోన వెంకట్ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా కెరీర్ ప్రారంభించారు. చాలా హిట్ సినిమాలకు బాబి స్టోరీలు అందించారు. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన పవర్ సినిమాతో ఆయన మెగాఫోన్ పట్టి తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టారు. ఇక బాబి భార్య అనూష కూడా గుంటూరు అమ్మాయే. బాబిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్.
బాబి ప్రేమ పెళ్లిలో చాలా ట్విస్టులు ఉన్నాయి. బాబి కాపు సామాజిక వర్గం వారు కాగా.. ఆయన భార్య అనూష కమ్మ వారు. బాబి మామగారు ప్రభుత్వ శాఖలో ఉన్నత ఉద్యోగి. బాబి లవ్‌స్టోరీ విషయానికి వస్తే బాబి ఫ్రెండ్, వాళ్ల భార్య స్నేహితురాలు ప్రేమించుకున్నారు. వారి ప్రేమకు సాయం చేసే క్రమంలో వీరు స్నేహితులు అయ్యారు. చివరకు వీరు ప్రేమలో పడ్డారు. విచిత్రం ఏంటంటే వాళ్ల ప్రేమ ఫెయిల్ అవ్వగా.. బాబి, వాళ్ల భార్య పెళ్లి చేసుకున్నారు.
ఇక గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక మనందరికి తెలిసిన అమ్మాయే. ఆమె చెస్‌లో ప్రపంచ స్థాయిలో ఎన్నో పతకాలు గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్షిప్ సైతం దక్కించుకుంది. ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది. ఆమె ఎవరో కాదు బాబి భార్య అనూషకు స్వయానా మరదలు. అంటే బాబికి స్వయానా మరదలు అవుతుంది. బాబి సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో హారిక ఎప్పుడూ సోషల్ మీడియాలో విషెస్ చెపుతూ ఉంటుంది.
తాజాగా వాల్తేరు వీరయ్య రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో ప్రి రిలీజ్ ఈవెంట్ టీవీలో చూసిన హారిక ఆ ఫొటోలు తీసి మరీ తన బావ సినిమా హిట్ అవ్వాలని విష్ చేసింది. సో సో సో ప్రౌడ్ ఆఫ్ యూ బావ. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేశావో నాకు తెలుసు.. నీ విజయం సెలబ్రేట్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నా అంటూ ట్వీట్టర్లో పేర్కొంది.