టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్ బాబు ..ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు . కాగా మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఫారిన్ లో హైయర్ స్టడీస్ చేస్తుంటే .. కూతురు సితార ఇండియాలోనే ఉంటూ చదువుకుంటుంది . ఫైనల్లీ సినిమా ఇండస్ట్రీ లోకి రావాలి అనేది సితార కోరిక .
ఆమె కోరిక ప్రకారమే తండ్రి మహేష్ బాబు కూడా పెద్దయ్యక హీరోయిన్ చేస్తాను అని మాట ఇచ్చారట . సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ ఉండే సితారా ఏకంగా తండ్రిని మించిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రీసెంట్గా సితార నాన్న అతడు సినిమాలోని “పిల్లగాలి అల్లరి” సాంగ్ కి డాన్స్ చేసింది . ఈ క్రమంలోనే తండ్రి చేతనే ప్రశంసలు అందుకుని సితార .. సొషల్ మీడియాలో మహేశ్ ఫ్యాన్స్ ని ఆశ్చర్య పరిచింది.
అయితే మొదటి నుంచి మహేష్ బాబుకి డ్యాన్స్ రాదు అంటూ ఎక్కువగా సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి . క్లాస్ స్టెప్స్ ఓకేచ్ మాస్ స్టెప్స్ వేయాలంటే కొంచెం ఇబ్బంది పడతాడని .. మొదటి నుంచి మహేష్ బాబు పై కంప్లైంట్ ఉంది . అయితే సితార మాత్రం ఎలాంటి స్టెప్స్ అయినా సరే అవలీలగా వేసేస్తుంది అంటూ ఘట్టమనేని ఫ్యాన్సే స్వయంగా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు కూతురు సితార చేసిన డాన్స్ వీడియో వైరల్ అవుతుంది..!!