వెండితెర అంటే.. నవరస సమ్మేళనం. ప్రేమ, దుఖం, రౌద్రం ఇలా.. అనేక అంశాలను తెరమీద చూపిం చేందుకు నటులు ఎంతో ఇష్టపడేవారు. దీనిలో ఒక భాగమే రొమాన్స్ కూడా..! అయితే.. నిజానికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా.. అప్పటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో.. ఈ నవరసాలను పండించేందుకు హీరో హీరోయిన్లు ఇద్దరికీ సమానంగా పాత్రలు ఉండేవి. కానీ, ఇప్పుడు ఈ సీన్లలో మెజారిటీ పార్ట్ అంతా కూడా హీరోలకే దక్కుతోంది.
హీరోయిన్లు ఎక్కువగా రొమాన్స్ సీన్లకే పరిమితం అవుతున్నారు. అదికూడా స్కిన్ షో తప్ప. ఏమీకనిపించ డం లేదు. ఇప్పటి తరం హీరోయిన్లలో నటనతో మెప్పించే హీరోయిన్లు ఎవరా అని ప్రశ్నింకుంటే గత 20 ఏళ్లలో ముగ్గురు, నలుగురు హీరోయిన్ల పేర్లు కూడా భూతద్దం పెట్టి వెతికినా దొరకవు. సరే ఈ విషయం పక్కన పెడితే.. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో హీరోయిన్లు తమ ముఖ కవళికలతోనే రొమాన్స్ పండించేవారు.
ఎక్కడా స్కిన్ షో మాత్రం ఉండేది కాదు. అయితే.. ఇక్కడ కూడా హీరోయిన్లను అందరినీ ఎంచుకునేవారు. రొమాన్స్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని భావించే సినిమాల్లో ఖచ్చితంగా.. సావిత్రికి ఎక్కువగా ప్రాధాన్యం ఉండేదట. ఒక దశలో భానుమతిని ఎంచుకున్నప్పుడు.. నిర్మాత అభిప్రాయానికి కూడా ఎక్కువ విలువ ఇచ్చేవారు. అయితే.. అలాంటి సీన్లలో ఆమె పెద్దగా నటించేందుకు ఇష్టపడేవారు కాదు.
దీంతో ఇలాంటి రొమాన్స్ సీన్ల విషయంలో భానుమతిని పెద్దగా తీసుకునేవారు. ఎందకంటే.. మాట కరకు.. నటన కూడా కరకే..! ఎవరినీ దగ్గరకు రానివ్వరు. చేయి కూడా వేయనివ్వరు. నిజానికి ఒకానొక దశలో నాలుగైదు సినిమాలు సైతం భానుమతి పోగొట్టుకున్నారని అంటారు. సో.. ఎలా చూసుకున్నా.. రొమాన్స్ సీన్లకు ఆమె వద్దయ్యా.. అనేడైలాగులు అప్పట్లో వినిపించేవట..!