Moviesసమంతది నిజమైన ఏడుపా..? ప్రమోషన్స్ ఏడుపా..?

సమంతది నిజమైన ఏడుపా..? ప్రమోషన్స్ ఏడుపా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ ని టార్గెట్గా చేస్తూ కొందరు ట్రోలర్స్ కావాలని కంటెంట్ ని క్రియేట్ చేసి సదరు హీరో హీరోయిన్ల పరువును మరింతగా దిగజార్చుతున్నారు. అసలే సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంత పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత సమ్మత పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఇక మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడినప్పటి నుంచి సమంత పేరు మరింతగా ట్రోల్ అవుతుంది.

ఈ క్రమంలోనే రీసెంట్గా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ సమంత.. డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడిన మాటలకు ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకుంది. అంతేకాదు మీడియా లైవ్ జరుగుతుంది అని కూడా చూడకుండా ..చిన్నపిల్లల ఏడ్చేసింది . ఈ క్రమంలోనే ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే సమంత అంటే గిట్టని కొందరు ఆమె ఎమోషన్ తో ఆటలాడుకుంటున్నారు.

గతంలోనూ సమంత యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఇలాగే కంటతడి పెట్టుకుంది. ఇప్పుడు శాకుంతలం సినిమా టైంలోనూ ఇదే విధంగా కంటతడి పెట్టుకుంది . ఇదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేస్తున్న స్ట్రాటజీనా ..? సమంత ఏడిస్తే సినిమా హిట్ అవుతుందా..? అంటూ కొందరు జనాలు ఆమెను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . మరి కొంతమంది మరింతగా దిగజారిపోయి సమంతది దొంగ ఏడుపు అని, కావాలని ఆమె అందరి అటెన్షన్ కోసం ఏడుపును వాడుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ సమంత ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news