బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయణాలు జోరుగా సాగేవని అంటారు. ఇప్పుడం టే.. సినిమా సినిమాకు హీరోయిన్లను మార్చేస్తున్నారు. దీంతో నటీనటుల మధ్య ప్రత్యేకంగా ఎలాంటి బంధాలు ఉండడం లేదు. కానీ, అప్పటి సినిమాల్లో ఒకే హీరో.. ఒకే హీరోయిన్ పదుల సంఖ్యలో చిత్రాలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో వారి మధ్య అనుబంధం కూడా అలానే ఉండేది.
ఇలా.. ప్రేమలో పడి.. జీవితాంతం కలిసి జీవించిన వారు ఉన్నారు. మధ్యలోనే విడిపోయిన వారు ఉన్నా రు. ఆదిలోనే బంధాలు తెంచుకున్నవారు కూడా ఉన్నారు. ఇలాంటి జంటే.. కృష్ణకుమారి.. హరినాథ్.. అని అప్పట్లో పెద్ద టాక్ నడిచేది. నిజానికి వీరు కలిసి నటించిన చిత్రాలు బహుతక్కువ. అయితే.. హరినాథ్ చూడడానికి చాలా అందంగా.. ముఖవర్ఛస్సు.. ఆకర్షణీయంగా ఉండేది.
దీంతో ఆయన నటిస్తున్నారంటే.. ఆయనతో కలిసి నటించేందుకు అనేక మంది క్యూ కట్టేవారట. అయితే.. వయసులో చిన్నవాడు కావడంతో అప్పటి తరంలో సావిత్రి, అంజలీ దేవి వంటివారు ఆయనకు అక్కగానో.. తల్లిగానో నటించారు. కానీ, గీతాంజలి, కృష్ణకుమారి వంటి వారు.. పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా గీతాంజలి, హరినాథ్ ఎక్కువగా నటించారు.
అన్నగారు ఎన్టీఆర్ తీసిన సీతారామ కళ్యాణం సినిమాలో తొలి అరంగేట్రం చేసిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ పండి.. పెళ్లి వరకు దారి తీసింది. తర్వాత కాలంలో అనూహ్యంగా కృష్ణకుమారి-హరినాథ్ ప్రేమలో పడ్డారనే పెద్ద గ్యాసిప్ ఉండేది. ఈ క్రమంలోనే ఆయన మద్యానికి అలవాటు పడ్డారని, గీతాంజలితోనూ విభేదాలు వచ్చాయని అంటారు.
తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి గొప్ప హీరోలతో సమాన స్థాయిలో ఉండాల్సిన హరనాథ్ చివరకు అమ్మాయిల పిచ్చితో పాటు విపరీతమైన డ్రింకింగ్ అలవాటుతో చిన్న వయస్సులోనే చనిపోయాడు.
అయితే.. దీనిలో ఏది నిజమో తెలియదు కానీ.. కృష్ణకుమారి-హరినాథ్ మాత్రం.. అనేక సందర్భాల్లో మీడియాకు చిక్కారని .. అప్పటి విశ్లేషకులు చెప్పేవారు.