కేఆర్ విజయ. ఆరు అడుగుల అందాన్ని.. అలా దింపేసినట్టు ఉండే మహానటి(ఈ బిరుదు రాకపోయినా.. ఆవిడ ఖచ్చితంగా అర్హురాలు అని సినీ వర్గాలు అంటాయి) ఆవిడ సినిమాలో నటిస్తే.. చాలు మహిళా ప్రేక్షకులు క్యూ కట్టి మరీ సినిమా చూసేవారు. అలాంటి కేఆర్ విజయ వాస్తవానికి ఏపీ నటి కాదు. పూర్తిగా తమిళియన్. అయితే.. ఆమె నటించిన తెలుగు సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి.
ముందు ఆమె నటించిన.. ప్రేమ కధా చిత్రాల్లో శోభన్‌బాబుతో నటించిన సినిమాలు హిట్టయ్యాయి. తర్వా త.. ఒక దశలో భక్తి ప్రధానమైన సినిమాల్లో నటించి.. ఇంటింటి ఇలవేల్పు అయిపోయారు. అసలు భక్తిరస చిత్రాల్లో అమ్మోరు పాత్రలు వేయాలంటే కేఆర్. విజయకు మాత్రం సొంతం అన్నంత గొప్పగా ఆమె ఆ పాత్రల్లో ఒదిగిపోయారు.
ఇదిలావుంటే, ఆమె అందం.. అభినయం ఎంతో పేరు తెచ్చుకున్నాయి. దీంతో ఆమె చుట్టూ అనే గ్యాసిప్‌లు కూడా పోగుపడ్డాయి. వీటిలో ప్రధానంగా ఆమె ఎఫైర్ల గురించి ఎక్కువగా చర్చ జరిగేది.
ఇదే విషయంపై ఒక సందర్భంలో విజయ మాట్లాడుతూ.. “నన్ను ఎక్కువగా ఇదే ప్రశ్న అడుగు తుంటా రు. మీకు ఎఫైర్లు ఉన్నాయా? అని! కానీ, సినీ ఫీల్డ్‌లో నాకు ఎలాంటి ఎఫైర్లు లేవు. అయితే.. నేను నటించిన సినిమా చూసిన ఒక పారిశ్రామిక వేత్త నన్ను కలిసేందుకు ఇంటికి వచ్చారు.
తొలి చూపులో ఆయన నన్ను ప్రేమించానని చెప్పారు. ఆయన అంత ధైర్యంగా ఇంటికి వచ్చి చెప్పేసరికి ఆశ్చర్య పోయా. తర్వాత.. మా పెద్దవాళ్లతో మాట్లాడి ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు“ అనివివరించారు. అంతేకాదు.. కేఆర్ విజయ భర్త ఆమె చెప్పినట్టే ఎంతో ప్రేమగా చూసుకున్నారు. పేద్ద బంగళా ఆమె కోసం.. సకల వసతులతో (ఇప్పుడు అంబానీ కట్టుకున్నారని చెబుతున్నట్టుగా) కట్టించారు.
ఇంట్లోనే హెలిప్యాడ్.. కూడా ఏర్పాటు చేయించారు. 30 కార్లు కొనిపెట్టారట. ఆ రోజుల్లోనే సొంత ఫ్లైట్ ఉన్న ఏకైక హీరోయిన్గా ఆమె రికార్డులకు ఎక్కారు. కానీ, ఆయన అనారోగ్యం భారిన పడిన తర్వాత.. వాటిని అమ్మేసి.. తాను చిన్న ఇల్లు కొనుక్కున్నానని విజయ చెప్పిన ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది.