Moviesపైకి సరదాగా కనిపించే తారక్.. మనసులో అంత బాధ దిగమింగుతున్నాడా..? కారణం...

పైకి సరదాగా కనిపించే తారక్.. మనసులో అంత బాధ దిగమింగుతున్నాడా..? కారణం ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోస్ ఉన్నా ..జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న పేరు.. క్రేజ్ ..లెవెల్.. రేంజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్.. మరి ఏ హీరోకి లేదనే చెప్పాలి. ఆఫ్ కోర్స్ తారక్ లాంటి మనిషి ఇక ఉండడు ..పుట్టరు.. పుట్టలేరు అని నందమూరి ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తుంటారు. అంతలా తాను అనుకున్న పనిని ఎంత కష్టమైనా చేసే స్వభావం కలవాడు నందమూరి తారక్ . ఆరారార్ అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్న ఆ సినిమా టైంలో ..ఆయనపై ఎంత హ్యుజ్ రేంజ్ లో జనాలు ట్రోల్ చేశారో మనకి తెలిసిందే.

అయినా ఒక్కరిని ఒక్క మాట అనని తారక్.. తన పని తాను చేసుకుంటూ నిజమైన మనిషిగా ప్రూవ్ చేసుకున్నాడు . అంతేకాదు పైకి చాలా సరదాగా చిల్ అవ్వుతూ నవ్వుతూ .. కనిపించే ఇప్పటికీ తన నాన్న హరికృష్ణ మరణం విషయంలో బాధపడుతున్నాడని సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మనకు తెలిసిందే హరికృష్ణకు తారక్ కంటే చాలా ఇష్టం.. తారక్ కి కూడా నాన్న హరికృష్ణ అంటే ప్రాణం.. ఏ ఈవెంట్ జరిగినా ఏ సినిమా స్టార్ట్ చేయాలన్న మొదట నాన్నకు చెప్పే ఆయన ప్రొసీడ్ అయ్యేవారు . అలాంటి నాన్న రోడ్ యాక్సిడెంట్లో మరణించారు అని తెలియగానే తారక్ కి గుండె ఆగినంత పని అయింది.

ఆయన అంతిమ సంస్కారాలలో తారక్ ఎలా చిన్న పిల్లవాడిలా గుక్కపట్టి ఏడ్చాడో ఇప్పటికీ మనం ఆ వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో చూడొచ్చు. అంతేకాదు ఇప్పటికీ నిద్రలేచిన తర్వాత తన నాన్న ఫోటోకి దండం పెట్టుకోవడం ..నిద్రపోయే ముందు గుడ్ నైట్ చెప్పడం తారక్ కి అలవాటుగా చేసుకున్నాడట . ఎంతమంది సరదాగా మాట్లాడుతున్న తన చేయి పట్టి నడిపించే నాన్న పక్కన లేడు అన్న విషయం గుర్తొస్తేనే తారక్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయట . ఎవ్వరికీ చెప్పకుండా రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుని బాధపడతాడట . చుట్టూ ఎంత మంది ఉన్నా ఓంటరి గానే ఫీల్ అవుతాడట తారక్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news