తెలుగు సినీ రంగంలో అనేక మంది చుట్టూ అనేక రూమర్లు ఉన్నాయి. క్యాస్టింగ్ కౌచ్.. అనేది బాలీవుడ్‌కే పరిమితమని పెద్ద చర్చ ఉంది. అయితే.. వాస్తవానికి దక్షిణాది సినిమా ఫీల్డ్‌లోనూ.. ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉంద ని.. గతంలో ఒకరిద్దరు సీనియర్ నటీమణులు చెప్పుకొచ్చారు. సరే.. ఇది ఎలా ఉన్నప్పటికీ.. తెలుగు సినీ ప్రపంచంలో ఒకింత వెనుకబడిన తార.. జయచిత్ర.
అందం, అభినయం.. ఉన్నప్పటికీ.. ఎందుకో ఆశించిన విధంగా ఆమె ముందుకు సాగలేకపోయారు. పైగా.. జయసుధ, జయప్రద, శ్రీదేవిల దూకుడు.. పోటీ ముందు జయచిత్ర నిలువలేకపోయారనేది వాస్తవం. అందం ఉన్పప్పటికీ.. బొద్దుగా ఉండడం ఆమెకు అవకాశాలను దూరం చేసిందని అంటారు. ఈ క్రమంలోనే దాసరి నారాయణరావుతో ఏర్పడిన పరిచయం.. ఆమెను హీరోయిన్‌గా ఒక స్థాయికి చేర్చింది.
`రావణుడే రాముడైతే..` అనే సినిమాలో అక్కినేని సరసన ముందుగా శ్రీదేవిని తీసుకోవాలని అనుకున్నారు. అయితే.. జయచిత్రతో అయిన పరిచయంతో దాసరి.. ఆమెను తీసుకున్నారు. ఈ సినిమాలోనూ ఆమె బొద్దుగానే కనిపించారు. అయినప్పటికీ.. తన స్వయంగా పాటలు రాసి.. మెప్పించారు. ఇందులో ఒక పాట సినిమాకే హైలెట్ అది.. `రవివర్మకే అందని అందానివో` అనేది. దీనిని బాలు పాడారు.
అయితే.. దీనివెను కథేంటంటే.. దీనిని దాసరి పట్టుబట్టి.. జయచిత్ర కోసం వేటూరితో రాయించారట. ఆయన మనసులో ఏముందో.. ఏమో.. తెలయదు కానీ.. పాటను జయచిత్ర కోసం రాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చసాగింది. అదేవిధంగా జయచిత్ర అనగానే దాసరి మనసు పొంగిపోయేదట..! ఇది అప్పట్లో ఓ హాట్ టాపిక్‌గా నడిచిందంటారు. ఏదేమైనా.. సినీ రంగం కదా ఇలాంటివి కామనే..!