టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య .. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా వైజాగ్ లో జరిగింది . ఈ క్రమంలోని వైజాగ్ మొత్తం మెగా ఫాన్స్ తో నిండిపోయింది. చిరంజీవి స్టేజ్ పైకి ఎక్కి వస్తున్నప్పుడు మెగా ఫాన్స్ చేసిన హంగామా అంతా అంతా కాదు . ఒక్కసారిగా ఠాగూర్ సినిమా టైమ్ గుర్తు చేశారు మెగా ఫాన్స్ . కాగా ఈ ఈవెంట్లో డైరెక్టర్ బాబి స్టేజిపై మాట్లాడుతూ కేవలం సినిమాల పరంగానే కాకుండా పొలిటికల్ పాయింత్స్ ని కూడా టచ్ చేయడం షాకింగ్ గా అనిపించింది.
ఇంతవరకు బాబీ ఎప్పుడు పొలిటికల్ పరంగా మాట్లాడిందే లేదు . అంతేకాదు స్టేజ్ ఎక్కిన ఎవ్వరు కూడా పొలిటికల్ పరంగా పొలిటికల్ టాపిక్ ని టచ్ చేయలేదు. కానీ ఎవరు ఊహించిన విధంగా బాబి తన మాటల్లో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు ఉండడం ఇప్పుడు చర్చినీయాంశంగా మారింది . కాగా వాల్తేరు వీరయ్య ఈవెంట్లో డైరెక్టర్ బాబి మాట్లాడుతూ.. పదేపదే ఆయన చిరంజీవికి ఎంత పెద్ద అభిమానిన్నో గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా చేసే అవకాశం ఆయనకు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు .
అంతేకాదు పొలిటికల్ పరంగా మాట్లాడుతూ..” అన్నయ్య మీరు ఈ పాలిటిక్స్ కి ఒక్క పర్సెంట్ కూడా సెట్ అవ్వదు.. మీలాంటి మంచి మనుషులు ఈ పాలిటిక్స్ రంగానికి పనికిరారు ..దెబ్బకు దెబ్బ కత్తికి కత్తి మాటకు మాట మాట్లాడే మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లే సెట్ అవుతారు” అంటూ పరోక్షకంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న కొందరు పెద్ద మనుషుల గురించి కౌంటర్ వేశారు . ఈ క్రమంలోనే మెగా ఫాన్స్ కూడా చిరంజీవి పాలిటిక్స్ రంగంలోకి పనికిరారని .. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పొలిటికల్ ప్రపంచానికి అవసరమని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే మంచిగా సాగిపోతున్న సినిమా ఈవెంట్లో పొలిటికల్ ఇష్యూస్ లేపి బాబీ తప్పు చేశాడని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు..!!